కొంగులేమొ రెండు కోమలి భుజములపై
ఒళ్ళు కప్పలేదు ఒక్కటైన
గొంతు చుట్టు బిగుసుకొనియుండు నవి చూడ
కొంగు లెందికింక కోమలాంగి?
భావం : నేటి ఆడపిల్లలకు భుజాలపైన రెండు కొంగులుంటాయి. కానీ, ఒక్కటైనా ఆమె ఒంటిని కప్పలేకపోతున్నది. చూడగా అవి ఆమె గొంతుకు ఉరిలా బిగుసుకుపోయి ఉంటాయి. ఈ మాత్రం దానికి ఆ కోమలాంగికి ఈ కొంగులెందుకు?
(నాటి స్త్రీ కి ఒక్క కొంగైనా ఒంటి నిండా కప్పుకొని ఉండేది మరి.)
రాత్రిపగలు లేక రమణులందరు నేడు
వింత నాగరికపు వెఱ్ఱిలోన
కోకలంత మరచి కోరి నైటీ వేసి
తిరుగుచుండిడవని తెరవ లెపుడు
భావం : విదేశీ నాగరికత వెర్రిలో మునిగిపోయిన స్త్రీలంతా నేడు గౌరవాన్నిచ్చే చక్కని చీరకట్టు మరచి రాత్రి, పగలు అనకుండా నైటీ వేసుకొని తిరుగుతున్నారు.
పాలకోసమింక పసికందు లేడ్వగా
పట్టలేదు పాలు పాప కకట!
నాగరికపు డ్రెస్సు నాణ్యమాయెదుగగా!
బిడ్డ పాలకెపుడు అడ్డమాయె!
భావం : ఆకలితో పసికందు పాలకోసం ఏడుస్తూ ఉంటే, తల్లి వాడికి తొందరగా పాలుపట్టలేని స్థితి నేడు బిడ్డ ఆకలికన్నా ఈనాడు తల్లి వేసుకొన్న దుస్తులు విలువైనవి. ఆ డ్రెస్సులకే ప్రాముఖ్యం కాబట్టి ఆ డ్రెస్సు బిడ్డడి పాలకు అడ్డమైంది.