చిత్ర కవిత
వేనవేల ఆలోచనలు
మీరెవరు చూడలేని వింతలు
కాలమొకటి తట్టి లేపే చైతన్య
నీవు నిర్లక్ష్యం అయితే
నేను అలసత్వం అయితే
మనం వినలేని మనం కనలేని
మర్మమేదో చెబుతుంది
స్వేచ్ఛ మీరి స్వచ్ఛత దాటి
వివేకం మరిచి విచ్చలవిడి సంచారమైతే
కరోనా ముందు కరోనా తరువాత
నానుడి అవుతుంది
చేతులు కలపడం
అశుభ్రత లో మనడం
నిషేధం విధించింది ప్రకృతి
నియమాలను విధించింది ప్రకృతి
ఇప్పుడు ముక్కూ మూతి కప్పుకోవడమే
ఇక అస్తమానం చేతులు కడగడమే
మాస్క్ శానిటైజర్ పదాలు
నీ
నా
మాటల ప్రవాహానికి అలల రూపు అయ్యాయి
సహజ వనరులు
సహజంగా మనవైతే
మన హృదయ తరంగాలు
గుండె తంత్రులు
మనో సంస్కారాలు
ఆనంద లోగిలి నిండా విరబూయాలి
_ డా. కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు