ఎ.ఎస్.మణి అంటే ఎవరికీ తెలీదు కానీ రచయిత్రి అరవింద అంటే అంతా గుర్తు పడ్తారు.అరవింద అనే కలంపేరుతో సాహిత్య వనంలో గుబాళించిన పువ్వు.అన్నంరాజు సుగుణ మణి ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీ లో చదివి1954లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ పొందారు.. భర్త ఉద్యోగరీత్యా జంషెడ్పూర్లో స్థిరపడ్డారు.4గురు కుమార్తెలు ఒక కొడుకు తో తన బాధ్యతలు నిర్వహించారు.కలంపట్టి సాహితీవేత్త గా కాలేజీ రోజుల్లో తన ప్రతిభను చాటుకున్నారు.1959లోఆంధ్రపత్రిక వీక్లీలో అల్లుడిమంచితనం అనేకథ ప్రచురింపబడింది.100కిపైగా కథ లు అచ్చు లో అలరించాయి.10కిపైగా
: నవలలు రాశారు.1971లో పగిలినప్రతిమ జలసూర్య పాపులర్ ఐనాయి.రచయితల ప్రశంసలు అందుకున్న నవల అవతలి గట్టు.మంచిచెడులమనోవిశ్లేషణ అవగాహన ఆమె రచనల్లో తొంగిచూస్తాయి.పిల్లలనవలప్రేమమంత్రం ఆం.ప్ర.సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం రచయిత్రి ఉత్తమ గ్రంధపురస్కారం గృహ లక్ష్మి స్వర్ణ కంకణం సుశీలానారాయణరెడ్డి పురస్కారం ఎన్నెన్నో ఆమె కీర్తి కిరీటంలో పొదిగిన మణులు.ప్రస్తుతం మణిమాట పేరు తోభావస్పందన కవితలు రాస్తున్నారు.సోషల్వర్కర్ గా తన వంతు పాత్ర పోషించారు.జంషెడ్ పూర్ ఆంధ్ర మహిళా సమితి కి సెక్రటరీ గా తెలుగు భాష పిల్లల కి నేర్పారు.సంగీతంజానపద సంగీతం కి ప్రాచుర్యం కల్పించారు.ప్రస్తుతం ప్రశాంతంగా ఆధ్యాత్మిక భావన లో హాయిగా జీవితం గడుపుతున్న ఈమెని గూర్చి తెలుసుకోటం ఆనందదాయకం