స్త్రీ నాద ప్రభంజనం

          మాధవపెద్ది ఉషా

ఏ కళనున్నావో పురుషుని సృష్టించావు,
అన్ని విధాలుగా దృఢత్వం, సామర్ధ్యం పొందు పరిచావు,
ప్రాణం పోసి ఆ మూర్తిని చూసి నీవే మురిసి పోయావు,
కానీ ఎక్కడో ఏదో లోపం..కనిపెట్టి నిరాశ చెందావు.
అప్పుడు కలిగింది నీలో మెరుపులాంటి ఓ ఆలోచన,
ఈ సృష్టికి ప్రతి సృష్టి చేసే వారంటు ఒకరుండాలి కదా
అనుకున్నావు,
వెంటనే ప్రతి సృష్టి చేయగల ఓ స్త్రీ మూర్తిని,
అన్ని విధాల పురుషుడికన్నా
ఎన్నో విశిష్ట గుణాల సమ్మిళిత సున్నిత రూపాన్ని తీర్చి దిద్దావు, అంతేనా
తను సృష్టి చేసిన బిడ్డను, ప్రేమించి లాలించగల నేర్పునిచ్చావు
ఇన్ని సుగుణాలరాసిని చేసి, పురుషుని అండలోజీవితం గడిపేలా అబలను చేసావేమయ్యా,
ఓ కమల సంభవా? నీకిది న్యాయమేనా ???
పురుషుని ఆగడాలను తట్టుకోలేక ఈ
స్త్రీ నాదం ఒక ఉప్పెనలా…ఓ ప్రభంజనంలా ఉప్పొంగితే,
ఈ భువన భువనాంతరాలు దద్దరిల్లిపోవా???

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కామేశ్వరిగారి పాట

మన మహిళామణులు