మన మహిళామణులు

 ప్రజ్వలవాణి సుచిత్రారావు

డాక్టర్ J వి.ఎల్.సుచిత్ర balakrishna హార్డ్వేర్ నెట్వర్క్ CCNA MCITP.HBU యూనివర్శిటీ ఆమె సోషల్ వర్క్ కి డాక్టరేట్ ప్రదానం చేసింది.ఆమె పడిన కష్ట నష్టాలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు వరించాయి.అందులో కొన్ని _సావిత్రీబాయి ఫూలే అవార్డు, భరతముని ఆర్ట్స్ అకాడమీ వారి ఆదర్శ వనిత, బాలమ్మ ఫౌండేషన్ ఫర్ బెస్ట్ సోషల్ సర్వీస్ ఫర్ సొసైటీ, గిరిజన యువజన సేవా సమితి అవార్డు, Red Magazine for Red Mission వారిది, commanding officer of SQN NCC for hardware networking classes వారి సన్మానం సత్కారం ఇలా ఎన్నో అందుకున్నా ఇంకా అందుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి.2015 లో Lakshmibai National Institute Of Physical Education గ్వాలియర్ లో మాస్టర్ కోచ్ గా పాల్గొన్నారు.ఇంకా ఆమె చేపట్టిన పదవులు బాధ్యతలు _విశాఖఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జనరల్ సెక్రటరీ గా, విశాఖపట్నం లోక్ అదాలత్ మెంబర్ గా సేవా కార్యక్రమాలు చేపట్టారు.2009లో ప్రజ్వలవాణి వెల్ఫేర్ సొసైటీ స్థాపించి దివ్యాంగులు ఇంకా రకరకాల మానసిక రోగులకు శిక్షణ ఉపాధి కల్పిస్తూ వారు కూడా సమాజంలో మనతో సమానమే అనే అవగాహన జనంలో కలిపిస్తూ ముందుకు సాగుతున్నారు.


18రకాల ఒకేషనల్ ట్రైనింగ్ ఇచ్చారు.1300కి పైగా చదివి శిక్షణ ఉపాధి పొంది దేశ విదేశాల్లో తమ సత్తా చాటుతున్నారు.రిటైరైనవారు, అమ్మ నాన్నలు, టీచర్ల కి ప్రత్యేక శిక్షణ ఇప్పించి వారి ద్వారా దివ్యాంగులకి శిక్షణ ఇప్పించటం ఈసంస్థ ప్రత్యేకత.పారా ఒలింపిక్స్ లో వీరి విద్యార్థులు సత్తా చాటారు.special child parents కూడా పిల్లలతో పాటు ఎన్నో నేర్చుకోవాలి.పిల్లలకి వారి కాళ్లపై వారు నిలబడే భరోసా ఇవ్వాలి అంటారు సుచిత్ర.ప్రతివారూ సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని ఆమె అభిప్రాయం!
సుచిత్ర గారి మాటల్లో ” నా జీవితంలోని ఢక్కామొక్కీలు ఆవేదన ఆక్రోశం నన్ను సంఘసేవికగా మార్చాయి.2009లో ప్రజ్వలవాణి నెల కొల్పాను.ప్రతిదీ మా శిక్షణ లో పిల్లలు తయారు చేస్తారు.దీపావళికి రకరకాల ప్రమిదలు తయారు చేయించి అవి అమ్మగా వచ్చిన డబ్బుని వారే స్వయంగా బ్యాంకులో తమపేర జమచేసుకుంటారు. అన్ని విధాలా దివ్యాంగులు మనతో సమానమే; మన కన్నా వారి లో కొన్ని అంతర్గత శక్తులు ఉంటాయి.వాటిని వెలికితీసి చేయూత ఇవ్వాలి అంతే!

సుచిత్ర మాటల్లో ఆమె అనుభవాలు తెలుసుకుందాం.
ఇంకా నా బాల్యం అసంతృప్తితో బాధాకరంగా సాగింది అనే చెప్పాలి.మాపేరెంట్స్ కి నల్గురు ఆడపిల్లలం.నాపై అక్క వినలేదు మాట్లాడలేదు. ఆమె కోసం నన్ను బలవంతంగా మాపేరెంట్సు ఆమె తోడుగా పంపారు.నాకు చెవుడు మూగలేకపోయినా ఆస్పెషల్ బడిలో చదవటం నాకుమొదట్లో బాధగా ఉండి ఏడిచేదాన్ని.కానీ పాజిటివ్ దృక్పథం తో ఆ సైన్ భాషనేర్చుకుని టీచర్ మెప్పు పొందాను. కంప్యూటర్లు బాగు చేసే కోర్సులో చేరాను.హార్ఠ్వేర్ ఇంజనీర్ గా నిలబడి పాత కంప్యూటర్లు కుట్టు మిషన్లు సేకరించి దివ్యాంగులకి శిక్షణ ఇవ్వడం ఆరంభించాను.అక్కయ్యపాలెంలో ఓఇల్లు అద్దెకు తీసుకుని వాలంటీర్లు తల్లిదండ్రులకు సైగల భాషలో శిక్షణ ఇచ్చాను. డిగ్రీ దాకా చదువు, డ్రాయింగ్ క్రాఫ్ట్ ఇలా నేర్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయటం నాధ్యేయం.స్పీచ్ ఫిజియోథెరపీ లో శిక్షణ పొందిన వారు నాకు సాయంగా ఉన్నారు.నా ఆరోగ్యం అంత బాగుండదు కానీ జీవితంలో ఏదైనా మంచి సాధించాలి అనే నా కల నెరవేరింది.”.
ఇంత పిన్న వయసులో ఎదురు దెబ్బలు తిని ఆదర్శ పథంలో సాగుతున్న సుచిత్ర గారి కి రామన్ మెగసెసె అవార్డు పద్మశ్రీ పురస్కారం రావాలని తరుణి తరుఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె భవిష్యత్తు సుఖంగా ఆరోగ్యం గా సాగాలని ఆశిద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చదువు – సంస్కారము

నాన్న ఎక్కడ