చిత్ర కవిత
నేలతల్లి పచ్చని నవ్వులు
తిలకమద్దిన ఎర్రమట్టి
పరుల పసిమి మిసిమి
చెట్లన్నీ ఒక్క భావోద్దీపనైతే
వ్యాహాళి హాయి ప్రాణుల ప్రీతి
ఈ జనారణ్యం మనిషి ప్రకృతిని
మనిషి కనుదోయిని
మెరుపు కలల సాంగత్యం లో
కట్టిపడేసే సుందర దృశ్యం
ఇప్పుడు కావాల్సిందేంటని
గుండె గుండెకో ప్రశ్న సంధిస్తే
మనసుకో తోడు మనిషికో గూడు
నాలుగడుగుల నడకకో పూలతోట
– డా. కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు