తండ్రిగారు: శ్రీ గోవిందరాజుల బాలాజీ రావుగారు
తల్లిగారు,: శ్రీమతి రంగమ్మ గారు
పుట్టుక 1904,పటమటలో విజయవాడలో.
చదువు అప్పటి కాలానుగుణంగా.
వివాహం వారి మేనత్త కుమారుడు బసవరాజు అప్పారావు గారితో ,1917లో. మద్రాస్ లో అప్పారావు గారు ఉద్యోగం చేసే రోజుల్లో మాంబళం లో ఉన్నారు తమిళం నేర్చుకున్నారు తర్వాత కన్నడం మరాఠీ గుజరాతి లలో కూడా బాగా అనుభవం పొందారు భర్తగారు 10 _6 _1933న చనిపోయారు. నిండా 30 సంవత్సరాలు కూడా లేవు అప్పుడు శ్రీ కాశీనాథ్ నాగేశ్వరావు గారు. సలహా మేరకు ఆమె జీవితాన్ని మహిళా జనోద్దరణ కి అంకితం చేశారు గుంటూరులో శారదా నికేతన్ హాస్టల్ కి నిర్వహణ బాధ్యత స్వీకరించారు గౌరవ కార్యదర్శిగా 12 సంవత్సరాలు శ్రీమతి లక్ష్మీబాయమ్మ గారికి చేదోడు వాదోడుగా ఉండి విద్యార్థినుల నిర్వాహకుల మన్ననలు పొందారు నాగేశ్వరరావు పంతులుగారు మరియు డాక్టర్ పట్టాభి సీతారామయ్య గార్ల సిఫారసు మీద వార్ధాలోని మహాత్ముని మహిళా ఆశ్రమంలో మూడు సంవత్సరములు శిక్షణ 19 38 నుండి 1940 వరకు బొంబాయిలో బెంగాలీలో కస్తూర్బా స్మారక నిధి ఆధ్వర్యంలో మహాత్ముని సమక్షంలో మూడు నెలలు సర్వోదయ కార్యకర్తల శిక్షణ ఆ తరువాత బొబ్బిలి, సీతానగరంలో ,మూడు సంవత్సరములు “నిధి” కార్యకర్తగా మహిళా కార్యక్రమం చేపట్టారు
సమరయోధ: విజయవాడలో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమంలో భాగంగా విదేశీ వస్త్ర దుకాణాలు వద్ద పికెటింగ్ ఖాదీ కుటీర పరిశ్రమ ల ప్రచారం చేశారు 19 47లో మహాత్ముని ఆశీస్సులతో గుంటూరులో సత్యాగ్రహం అరెస్ట్ రెండు నెలలు జైలు శిక్ష మహాత్ముని నిర్మాణ కార్యక్రమం అంశమైన హిందీ భాషా ప్రచారార్ధం దక్షిణ భారత ప్రచార సభ మహిళా హాస్టల్లో గౌరవ వార్డెన్ గా పదవి నిర్వహణ చేశారు గుజరాతి మండలి లో హిందీ బోధన ఇంటి వద్ద కూడా హిందీ బోధన చేశారు.
సాహిత్య సేవలు: సాహిత్య సేవలు కూడా చేశారు భర్త సాంగత్యం వల్ల కవనం వ్యాసరచన కౌశలం అలవడింది “భారతి” “గృహలక్ష్మి” “ఆంధ్ర వార పత్రిక”లలో ప్రతిరించబడేవి ఈమె “సౌదామిని” అని మారుపేరుతో రాసేవారు ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలలో సమ్మేళనంలో కవిత గోష్టులలో పాల్గొనేవారు అనేక గీతాలు వ్యాసాలు కథానికలు కాక “అప్పారావు_ నేను” ఆకాశవాణి మద్రాసు కేంద్రం నుండి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయ్యేవి ఆ ప్రసంగాలలో ప్రచారమైన తన ప్రసంగాలలో కొన్నిటిని ఏర్చి గూర్చి సంపుటి గా వెలువరించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు 1972లో విశిష్ట రచయిత్రి సన్మాన గ్రహీత.
స్వాతంత్ర సమరయోధులు :1975 లో ఢిల్లీలోని ఎర్రకోటలో స్వాతంత్ర భారత ప్రభుత్వ సన్మాన గ్రహీత,
దేశాటనం తీర్థయాత్ర లు: భర్తతో కలిసి భారత దేశ పర్యటన ఆ తరువాత తనవార్ధక్యంలో కూడా బదిరీ కేదారాలు వంటి తీర్థయాత్రలు ఒంటరిగా చేశారు. సోదరుడి భార్యా వియోగం వల్ల ఆ బిడ్డల కోసం సోదరుడి దగ్గర వుండి వారిని ఒక పద్ధతిలో ఒక మార్గంలో నడిపించిన మహనీయ చరిత ఆమె సాంగత్యం ఒక సాహిత్యం ఒక భవిష్యత్తు ఒక జ్ఞానం.
వార్ధక్యం విశ్రాంతి: జీవిత చివరి దశలో సోదరుడి దగ్గర ఉన్నారు
మరణం: 8_ 6_ 75మరణం,తనపుట్టినింట పటమట లో అనాయాస మరణం.
ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి 1972 విశిష్ట రచయిత్రి పురస్కార సన్మాన గ్రహీత!!!
ఇంత చెప్పినా ఇంకా ఎంతో చెప్పాలి!
తమ్ముని బిడ్డల కోసం వచ్చి వారిని ఒక పద్ధతిలో పెంచి చదివించి మంచి మార్గంలో నడిపించిన మహనీయ చరిత ఆమె సాంగత్యం, ఒక సాహిత్యం,ఒక భవిష్యత్తు, ఒక జ్ఞానం!!!
ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే ఆమె నన్ను సొంత బిడ్డలా చూసుకునేది.నా కొడుక్కి
వీపు మీద అరచేతి కైవారంలో “చప్పి” అంటారు.అది చిన్ని పొక్కులు వచ్చి,ఎర్రగా
అయిపోతుంది,నొప్పి కూడా ఉంటుంది.అది చూచి నా దగ్గరికి తీసుకురామ్మా అన్నారు మంత్రం వేస్తానని అంతే.మంత్రం వేశారు పై పూతకిమందిచ్చి చక్కగా తగ్గించినా ప్రేమ మూర్తి ఎంత చెప్పినా చాలా కొంచమే అవుతుంది కానీ పోగొట్టుకున్న మాకు తీరని, తీర్చలేని లోటు!!
శ్రీమతి బసవరాజు రాజ్యలక్ష్మి గారికి శతకోటి నమస్కారములు