రెండు రెప్పల గుచ్ఛాలు విచ్చినవి
నవ వసంతాలో నందనవనాలో
ఆనంద తీరాల చేర్చి అద్భుత ఫలితాల
తానున్న లోకంలో తనదైన స్వేచ్ఛ కోసం
వెన్నెల కాంతిని కుంచెకు ఇచ్చి
వేదన లేని క్రోధం లేని
కొత్త జీవన తరంగాలు కనుపాప దృశ్యంలో
చిత్రం లో చిత్రమై …..
_ డా: కొండపల్లి నీహారిణి