చీకటి_.వెలుగులు

            కొప్పరపు తయారు

వెలగాలని వెలుగు ఉప్పొంగి
ఉప్పొంగి పొంగిపోతుంది
తనని తాను దాచుకోవాలని
తరగని కష్టం అనుభవిస్తుంది!

చీకటి, చీకటి వెలుగుల స్నేహమా?
లేక, కయ్యమా ? తెలియకుంది
ఈ చిన్ని హృదయానికి!
తెలుసుకుందామని ప్రయత్నం
కానీ, సఫలీకృతమగునా?

వెలుగు విజృంభించు ప్రతి చిన్న
అణువు పై , సంతోషాలు పంచు
సకలములు, వెలుగులా
వెలగాలని కోరిక, ఒక‌ ఆశ !

కానీ చీకటి కమ్ముతోంది పెను
భూతముల వెలుగుని కడుపులో
దాచుకుని కడు దుర్మార్గపు చర్య
తో కలిసేకృతం అవుతోంది!!

ఏమిటి చెబుదామంటే చీకటి
వెలుగులు ఒకటే మాట
కానీ తారతమ్యాలు భూమ్యా
కాశాలు , అంతులేని అనంతమైన
యక్ష ప్రశ్న ఎలా మరి !!

Written by Tayaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Paneer Butter Masala

ఇవ్వండి భరోసా !!