ఏమి లేని చోట ఏదో పుట్టిస్తే !
ఎంత బాగుంటుంది ! మాహాద్భుతం ||
తెల్లని పటం మీద చిత్తరువులాగ ||
ఏదో ఆనందం! మహాద్భుతం !
శూన్యాకాశంలో నక్షత్రాలు
అమ్మాయి కడుపులో అమాయక శిశువు
రెండు ఆకుల మధ్య మొగ్గ
అరచేతిలో ప్రేమ స్పర్శ
వెదురు గొట్టంలో వేణునాదం
మౌనం నుంచి మాట ఎలా పుట్టాయి ???
ఇదేనా మాయా! మహా శక్తి చైతన్యం.
ఏమి లేని చోటు లేదు
ఈ కళ్ళకు కనిపించదు. అంతే !