తెలుగు ఆంగ్లంలోఎం.ఎ.పిజిడిసిజె చేసిన శైలజా మిత్ర గారు సాహిత్యం లో అన్ని రంగాల్లో తన ప్రతిభను ప్రదర్శించారు.కవిత కథ నవల సమీక్ష విశ్లేషణాత్మక వ్యాసాలు అన్ని తెలుగు దిన వార మాసపత్రిక ల్లో రాశారు.ఆకుపచ్చని నిజాలు ఈనాటిది తీరమో నీకు నువ్వే అనే నవలలో శీర్షికలు భిన్నంగా ఉండి ఆలోచింపజేస్తాయి.సిల్వర్ లైన్స్ అనే ఆంగ్ల కవితా సంపుటితో పాటు ఆంగ్ల అనువాదాలు చేయటంలో అందెవేసిన చేయి కూడా!
ఉషోదయ వెలుగు పత్రిక లో మానవీయం అనే పేరుతో 46సాంఘిక వ్యాసాలు భక్తి రంజని పత్రిక లో 42భక్తివ్యాసాలు రాశారు.ఆంధ్రభూమి ఆంధ్ర ప్రభ నేటినిజం సుజన రంజని (వెబ్ మ్యాగజైన్)..ఇలా అన్నింటిలో పుంఖానుపుంఖాలుగా వెలువడినాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం సాహిత్యశ్రీ బిరుదు (అఖిల్ భారత్ భాషా సాహిత్య సమ్మేళన్.. భోపాల్) ఆరుద్ర శ్రీశ్రీ
దేవులపల్లి జ్వాలాముఖి పురస్కారాలు ఆమె కీర్తి కిరీటంలో మెరిసాయి.ఇక ఆమె
మాటల్లో ఇలా తన అనుభవాలను పంచుకున్నారు ”
రేడియో లో సొంతం గా పాటు రాసి పాడటం ఓదివ్యానుభూతి! రేడియో నాటకాల్లో పాల్గొన్నాను.మాఅత్తగారు సుశీలమ్మ గారి ప్రోత్సాహం నాభర్త అండదండలతో పూర్తిగా రచనల్లో మునిగి పోయాను.సృష్టి కేతనం అనే తెలుగు సాహిత్యంలో మహిళా సమస్యలపై వచ్చిన మొదటి కావ్యరచన అందరి ప్రశంసలు పొందింది.674పుస్తక సమీక్షలు 16గ్రంథాలకు ముందు మాటరాశాను.బెంగుళూర్ సాహిత్య అకాడమీ వారి ద్వారా 15రోజుల ట్రావెల్ గ్రాంట్స్ తీసుకుని చెన్నైలో రచయితలను కలిసి అక్కడి సాహితీ విశేషాలు చర్చించటం మరపురాని అందమైన అనుభూతి అనుభవం!
డాక్టర్ పోతుకూచి సాంబశివరావు గారు నాకు ఆదిగురువు.నాతొలి కవిత తొలి కథ తొలి నవల ఆంధ్ర భూమి లోదిన వారి మాస్ పత్రికలలో అచ్చు కావటం విశేషం!నేటి నిజం పేపర్ నాకు ప్రత్యేకతను సంతరించి పెట్టింది.సర్వశ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ సుధామ ఓలేటి పార్వతీశం గార్ల కవితలు నాకు చాలా ఇష్టం.మంచిసాహిత్యం ఎప్పటికీ నిలుస్తుంది. కొన్ని పత్రికలకు జర్నలిస్టు గా కాలమ్స్ రాశాను.ఒక విషయాన్ని శ్రద్ధగా పరిశీలించి అందులోని వర్త్ నుంచి గుర్తించి హర్షించాలి.'” ఇలా తన జీవితానుభవాలు తరుణితో పంచుకున్న శైలజా గారు అందరితో మిత్రత్వం కలిగి సార్ధక నామధేయురాలైనారు.
సాహిత్యమే నా ఊపిరి అక్షరమే నా ఆయుధం- శైలజా మిత్ర
నేను, అనే పదం అనేది చాలా కష్టతరమైంది. నేను ఎవరు, అనే ప్రశ్న ఎప్పటికీ ప్రశ్న అయినా నేను, అనే మొదలుపెడతాను నేను 1966 సంవత్సరం జనవరి 15 వ తేదీన చిన్న గొట్టిగల్లు అనే గ్రామం చిత్తూరు జిల్లాలో జన్మిందాను తెలికిచెర్ల శేషగిరిరావు తెలికిచెర్ల అనసూయాదేవి మా అమ్మ నాన్నలు నాకు ముగ్గురు అన్నయ్యలు ఒక అక్క ఒక చెల్లి కలిపి మొత్తం మేము ఆరుగురం నాన్న గారు కార్వేటి నగరంలో మొదట హిడ మాస్టర్ గా పనిచేసారు తర్వాత డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా ప్రమోషన్ వచ్చి చిత్తూరుకు వచ్చాము తర్వాత మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసరగా పూతలపట్టు నుండి నాన్న రిటైర్ అయ్యారు. అక్కడి నుండి అక్కడ మా చదువులు కూడా పూర్తయ్యాయి మాది మద్యతరగతి కుటుంబం చదువుకోవడం తప్ప మరే ఇతర ఆలోచనలు లేవు అలాగే అందరూ ఏస్టుగ్యాడ్యువేషన్స్ పూర్తి చేసాము నేను బిఎ ఇంగ్లీష్ లిటరేచర్ పివిఎన్ గవర్నమెంట్ కళాశాల చిత్తూరులో చదివాను వివాహానంతరం ఎంఏ తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ, పిజిడిపిజి ఏజీ డిప్లొమా ఇన్ రచనా జర్నలిజం కాలేజీ చదివాను నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరూ ఎంబిఏ చదివారు ఒకరు ముంబయిలో మరొకరు చెన్నైలో స్థిరపడ్డారు నా భర్త ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగస్తులు ఇదే నావరకు నేను
నాలోనేను
మా ఇంట్లో సాహిత్యం రచయిత్రులపై డిస్కషన్స్ అనేవి ఎప్పుడూ ఉండేవి కావు కాకుంటే సాహితీ పత్రికలు మాత్రం అనేకం నాన్న అమ్మ చదివేవారు వాటిని మేము ముట్టుకోబోతే నాన్న వద్దసేవారు. అవన్నీ ఇప్పుడు మీకు అనవసరం నీ చదువు నువ్వు చదువు అని మాకు కనిపించకుండా ఉంచేవారు ఎందుకు చూడనివ్వవు నాన్నా, అని అడిగితే ఇవన్నీ ఈజీ లిటరేచర్ నువ్వు నేర్చుకోవాల్సింది పోర్ట్ లిటరేచర్ ఇవి చదవడం మొదలుపెట్టావంటే ఆ హార్లను నీ బ్రెయిన్ యాక్సస్ట్ చేయదు అని చెప్పేవారు మరి నాన్న ఎడ్యుకేషన్ డిపార్టమెంట్ కదా, అది నిజమేననిపించింది. నేను కూడా ఇక ఆ వైపుకు వెళ్ళలేదు. ఏ పుస్తకం కోసం వెదకలేదు. వద్దన్నారు అంతే అనుకున్నాను నాకు చిన్న తనం నుండి సంగీతం అబ్బింది మంచి గాత్రం నాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం నిత్యం పాటలు పాడుతూంటే స్కూల్ పోటీల్లో ఎప్పుడూ మెదటి స్థానంలో నిలిచేదాన్ని అందుకే నాన్న నాకు ఐదేళ్ళ పాటు కర్నాటక సంగీతం నేర్పించారు. ఇప్పటికీ నాకు కర్నాటక సంగీతం అంటే చాలా ఇష్టం కానీ వివాహానంతరం ఓకల్ కార్డ్స్ ప్రాబ్లమ్ రావడం మూలంగా నా గాత్రం పోయింది. పాట నాకు దూరం అవ్వడంతో నేను చాలా ఒంటరిగా అయినట్లు భావిందాను నానుండి ఏదో ఒక అత్యవసరమైన ఒక భాగం దూరమైనట్లుగా కుమిలిపోయాను.
చిన్న తనం నుండి నాకు ఒకరి బిడ్డగా వేరొకరికి తల్లిగా మాత్రమే ఉనికిని పట్టుకుని బతకడం ఇష్టం ఉండేది కాదు నాకు నేనుగా ఒక గుర్తింపు పొందాలని మాత్రం నిరంతరం నా మనసులో ఉండేది. అందుకే చదువు అంతంత మాత్రం ఉన్నా పాటల ద్వారా మాత్రం స్కూల్ నుండి కాలేజీ దాకా నన్ను నేనుగా నిరూపించుకున్నాను.