బాధ్యతతో కూడిన వ్యక్తిత్వాలు అవసరం

           శివల పద్మ

నిత్యజీవితంలో మనం పూర్తిగా అరికట్టాల్సిన ఒక సమస్య వృధా . నిత్యా జీవితం లో చాలాచోట్ల చాలా విషయాలు వృధా అవుతూ మనకి కనిపిస్తాయి .ముఖ్యంగా అందులో మనం చెప్పుకోదగ్గది మంచినీటి వృధా…..
ఇది అందరి ఇళ్లల్లో అన్నిచోట్ల కనిపిస్తుంది ముఖ్యంగా పని మనుషులు ఉన్న ఇళ్లల్లో అయితే నీటి వృధా చాలా ఎక్కువగా ఉంటుంది ..వారు చాలా బాధ్యతారహితంగా నీళ్లను పారబోస్తూ ఉంటారు . వాటర్ బిల్లు తో వారికి సంబంHధం ఉండదు. మళ్లీ వాళ్లే వాళ్ళ బస్తీల్లో నీటి కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు..నీరు లేని జీవితాన్ని ఒకసారి ఊహించుకుంటే ఒళ్లు జలదరిస్తుంది.

.అలాగే ఇళ్లల్లో లైట్లు వేసేసి వెళ్లిపోవడం.. ఫ్యాన్లువేసేసి వెళ్లిపోవడం… టీవీ ఆన్ లో ఉంచేసి పడుకుండి పోవటం ఇలాంటివి చేస్తారు. ఇవిచాలా సాధారణంగా జరిగే విషయాలు. కేవలం నిర్లక్ష్యం తప్ప ఇంకేమీ దీనికి కారణం కాదు.

ఇవన్నీ కూడా మనకి సహజ వనరుల ద్వారా వస్తున్నవి .అంటే ప్రకృతి ద్వారా వస్తున్నవే అంతే తప్ప మనం తయారు చేసుకున్నవి కావు. ఏ రోజైతే ప్రకృతిలో వీటి నిలువలు తగ్గిపోతాయో ఆరోజు మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

దేశంలో ఈ రోజు నీటి సమస్య చాలా రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది అలాగే నీటి వృధా కూడా చాలా రాష్ట్రాల్లో ఉంది. ఈ రెండిటికీ సమన్వయం కుదరదు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నీళ్లు లేక పక్షులు నేల రాలి ప్రాణాలు వదులుతున్నాయి..!! కొన్నిచోట్ల కొన్ని రాష్ట్రాల్లో హోటల్స్ లో నీళ్లు చాలా వృధాగా పోతూ ఉంటాయి. పట్టించుకునే వారే ఉండరు అక్కడ .
అలాగే ఇళ్లలో పిల్లలు తిండి వస్తువుల్లో చాలా వృధా చేస్తూ ఉండడం కనిపిస్తుంది. ఫంక్షన్లో తిండి వస్తువులు చాలా వృధాగా డస్ట్ బిన్ లో వేయడం కనిపిస్తుంది. చాలా బాధ కలిగిచ్చే విషయం ఇది. ఒకపక్క కోట్ల మంది ఆకలితో బాధపడుతూ ఉంటే చాలామంది ఆహార పదార్థాలను నిర్లక్ష్యంగా చెత్తకుండీలో పారేస్తుంటారు.

ఇది చిన్నతనం నుంచి పిల్లలకి ఈ వృథాలను తగ్గించుకోవడం నేర్పించాలి. సహజ వనరులు అంటే ఏమిటి… అవి అడుగంటి పోతే మన జీవితాలు ఎలా ఉంటాయి? వృధా చేయడం వల్ల మనకి వచ్చే నష్టాలు ఏమిటి ? వంటి విషయాలు పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది .ముఖ్యంగా మహిళలు తమ తీరుబడి సమయంలో దగ్గర్లో ఉన్న స్కూళ్లకు గానీ బస్తీలకు గాని వెళ్లి పిల్లలకు ఈ వృధాగా చేసే పనులకు పరిణామాలను వివరించి చెప్పాలి. ఇది చాలామంది గృహిణీలు చేయగలరు.

చాలా చోట్ల రోడ్డు సైడ్ టాప్ ఆన్ చేసి నీళ్లు పట్టుకొని దాన్ని అలాగే వదిలి వెళ్ళిపోతారు. అలాంటివి కనిపించినప్పుడు ఆపాలి అని పిల్లలకు చెప్పాలి. అలాగే రోడ్డు మీద లైట్లు మధ్యాహ్నం వరకు వెలుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన సమాచారం కనీసం కొంత పెద్ద పిల్లలు ఒక ఫోన్ ద్వారా వాళ్ళ చేతిలో ఫోన్లు ఉంటాయి కనుక దానికి చెందిన విభాగానికి తెలియ చెప్పాలి. ఇది సమాజసేవ కాదు. మన భవిష్యత్తు కోసం మనం తీసుకుంటున్న జాగ్రత్తలు అని పిల్లలకు వివరించి చెప్పాలి.

ఎక్కడ వృధా కనిపిస్తున్నా వెంటనే దాన్ని ఆపడం పిల్లలకి చిన్నతనాన్నే నేర్పించాలి. ఎందుకంటే రానున్న కాలంలో వారు అనుభవించాల్సిన వనరులు ఇవన్నీ. ఇవి వృధా అవుతే వారు అనుభవించేందుకు మిగలవు .ఆపైన వారు ఇబ్బంది పడాలి. ఇవేవీ కూడా కోట్లతో కొనగలిగేవి కావు .

ఈ దేశం లో వనరుల ఇబ్బంది కరువు ఎంత ఉందో నిర్లక్ష్యం కూడా అదే స్థాయి లో ఉంది. శుభకార్యాలలో ఈ వృధాకి పరిమితి ఉండదు. అలాగే కొంతమంది గృహిణులు కూడా అనవసరంగా ఎక్కువ వండి మిగిలినవి పారేస్తూ ఉంటారు.

భూమిలో సహజ వనరులు కోల్పోతే డబ్బుతో తిరిగి తెచ్చుకోలేం. ఈ విషయం పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పి ఈ సహజ వనరులను కాపాడడం ఎంత ముఖ్యమో వారికి తెలియచెప్పాలి. అలాగే ఆహార పదార్థాలు వృధా చేయకూడదు అని వారికి కథల ద్వారానైనా వివరించాలి. ఇళ్లల్లో లైట్లు ఫ్యాన్లు మనం లేని సమయంలో ఆఫ్ చేయాలి అని వారికి నేర్పించాలి. ఇవి తల్లితండ్రులు అయినా చెప్పాలి. లేదా సామాజిక కార్యకర్తలైనా చెప్పాలి .ఈ పని గృహిణులు స్వచ్చందంగా చేయవచ్చు. ఇప్పటి నుంచి వాళ్ళకి మనం ఈ విషయాలను తెలియజేస్తే రానున్న కాలంలో ఈ వృధా కాస్తంత అయినా తగ్గే అవకాశం ఉంటుంది.

Written by Shivala Padma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వి’శ్వాస’దీపం

వింజమూరి సరస్వతి