తరుణి చిత్రం

ముఖచిత్ర కవిత

              గీతాచార్మి

 

ఆమె సీత
ఆనాటి సీత
మంటల్లో కాలని మహిమాన్విత
ఆమె సీత
అగ్ని ప్రవేశ పరీక్ష
ఆమె విజేత!
మంటలు మల్లెలు
మంటలు మరీచికలు
సీత గీత తెలుసు
సీత దాటిన గీత తెలుసు
తెలియనిదల్లా
తెలియనిదల్లా
రాముని గుండెకు

సెగలేవీ తగలలేదానే!
ఆమె సీత
ఈనాటి సీత
కోరలు చాచిన మంటలు
కోటి కోర్కల మంటలు
ఆమె ఈనాటి సీత
అగ్ని ప్రవేశ పరీక్ష లు
పెట్టగల సీత
ఆలోచననల మంటలవ్వి!!
– డా. కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక సంపాదకులు

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అచ్చెరువు

తరుణీయం