ధరిత్రీవందనం

     దామరాజు విశాలాక్షి

బంగారు సింగారు భరతమాతకు మనము

నిండార దండాలు పెడదామా

దండిగాసేవలు చేద్దామా              ||బంగారు సింగారు||

 

గంగ యమున సింధు

కన్నతల్లయినట్టి భరతమాతకు

దండమెడదామా

భక్తితో సేవలు చేద్దామా               ||బంగారు సింగారు||

 

వింధ్య ఆరావళి

హిమగిరులతో ఒప్పేటి

ధర్మమూర్తికి దండం

పెడతామా

ధరణిలో శ్రేష్టతను చూద్దామా        ||బంగారు సింగారు||

 

తల్లి స్వేచ్ఛ కొరకు

తనువు లర్పించినా  త్యాగధనులను

తలచుకుందామా

తరతరములకు

చెప్పుకుందామా                     ||బంగారు సింగారు||

 

వీరులను శూరులను

విజ్ఞాన వేత్తలను

కన్న భారతి కి దండం పెడతామా

విజయ మాలలు

మెడలో వేద్దామా                             ||బంగారు సింగారు||

 

అన్నపూర్ణగ జనని

నావిష్కరించిన

అన్నదాతల

తలచుకుందామా

అవనినిలో

కాపాడుకుందామా                  ||బంగారు సింగారు||

 

రేయనక పగలనక

సరిహద్దులలొ కాచి

శత్రువులశిరములతో ఆటలాడునట్టి

సైనికులకుమొక్కు కుందామా

సాహసులను తలచుకుందామా     ||బంగారు సింగారు||

 

దేశసేవ యనెడి

దీక్షను వహించి దేశభక్తి తోడ

ధీరులై చరియించు

స్త్రీ బాల వృధ్ధులను  చూద్దామా

చేయెత్తి దండము  పెడతామా       ||బంగారు సింగారు||

 

సహజవనరులతోన సశ్యశ్యామలమైన

శ్రామికులకృషితోన

శోభిల్లి వెలిగినా

సవిత్రికి దండమెడదామా

ధరణిలో గొప్పదని చెబ్దామా          ||బంగారు సింగారు||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అభిప్రాయ వేదిక

శ్రీమతి డా|| కొఠారివాణీ చలపతిరావు