శ్రీ భారత్ ఛానల్ ద్వారా
మన విదుషిమణులు
అన్న శీర్షికపై కొండపల్లి నిహారిణి గారు చేసిన ప్రసంగం
భావితరాలకు స్ఫూర్తిదాయకం కథనరంగమైనా కథా రంగమైన నాటి నుంచి నేటి వరకు సమర్థంగా నిర్వహిస్తారు అనడానికి
ఎన్నో శాసనాలను సాక్షాలుగా చూపిస్తూ మహిళలు రాసిన పద్యాలను వారి యొక్క భావనలను చక్కగా వివరించారు
మొల్ల రామాయణంలో
రాముడు సీత మధ్య జరిగిన సంభాషణలో రచయిత్రి మొల్ల గారు సీతమ్మ స్వ అభిమానాన్ని ఎంత చక్కగా వివరించారు నిహారిని అంత చక్కగా ఇక్కడ వివరించాడు
ఖడ్గ తిక్కన గారి యుద్ధము నుండి తిరిగి వస్తే అతని తల్లి భార్య ఎలా స్పందించారు వారి పద్యాల ద్వారా వారి రచన ద్వారా శ్రావ్యమైన కంఠముతో పద్యాలను పాడుతూ స్పష్టమైన వివరణ ఇస్తూ నాటి రచయిత్రుల గొప్పతనాన్ని చక్కగా వివరించిన నిహారిణి గారికి అభినందనలు నేటి మహిళల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికితీస్తూ
తరుణి అంతర్జాల మ్యాగజిన్ ద్వారా మహిళా శక్తిని ప్రపంచానికి చాటుతున్న మీకు అభినందనలు
అవకాశాలు లేని నాడు కూడా మహిళలు అవకాశాలని వెతుక్కుని
అరచేతిని అడ్డుపెట్టి ఆపలేరు సూర్య రష్మీ అన్నట్టు వారి యొక్క గొప్పతనాన్ని చరిత్ర పుట్టలో చిరగకుండా నిలపగలిగినారు వెలికి తీసే అవకాశం నీకు అందింది
చక్కగా వినియోగించుకుని నాటి కవయిత్రులని వెలికి తెచ్చిన మీకు కృతజ్ఞతలు
కమలారెడ్డి