ఈ శీర్షిక వేదికగా నేను మన మహిళలలో మాణిక్యాలు , తేజోమూర్తులైన మహిళా మణులను గురించి , వారి వారి గొప్పతనం తెలుపుదామని అనుకుంటున్నాను.
ఈరోజు మనం చదువుకోబోయే మాణిక్యం , మాణిక్యాల కన్నా గొప్పదైన జానకి వెంకట్రామన్ గారి వ్యక్తిత్వం, మంచితనం గురించి తెలుసుకుందాం.
గౌరవనీయులైన జానకి గారు అవర్ ఫస్ట్ లేడీ.
వీరి ఇంట్రడక్షన్ ఫస్ట్ లేడీ గా ప్రారంభించి, తనదంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు.
జానకి గారు భారతదేశం గర్వించదగ్గ వ్యక్తులలో ఒకరైన ఆర్. వెంకటర్రామన్ గారి భార్య. అందుకే ఆయన భార్య గా జానకీ వెంకట్రామన్ గారు ‘ అవర్ ఫస్ట్ లేడీ‘ గా పేరుగన్నారు.
శ్రీ వెంకట్ రామన్ గారు మన భారతదేశ ఎనిమిదవ రాష్ట్రపతి.
వీరి వివాహం 1938లో జానకి గారితో జరిగింది.జానకి గారు 1921లో మయన్మార్ లో జన్మించారు . వీరికి ముగ్గురు కుమార్తెలు.
ఆమె వివాహం తర్వాత ఆమె భర్త వెంకట్రామన్ గారి రాజకీయ , సమైక్యవాద కార్యకలాపాలలో చేదోడువాదోడుగా ఉన్నారు .వెంకట్రామన్ గారికి సహాయం చేయడానికి అతను స్థాపించిన లేబర్ లా జనరల్ లో ఆమె భాగస్వామ్యం అమోఘం.
జానకి గారి వ్యక్తిత్వం స్ఫూర్తిదాయక మైనది.
ఆమె ఒక గొప్ప స్త్రీవాది .మహిళల స్వావలంబనకు మద్దతు నిచ్చేవారు. మానవ హక్కుల కార్యకర్త . బంగ్లాదేశ్ యుద్ధంలో మహిళలపై జరిగిన యుద్ధ హింసను తమ నిరసనలో వ్యక్తపరిచారు . అలాగే మానవతావాది . పేదల కోసం ప్రాజెక్టులపై పనిచేసింది . అదనంగా ఆడవారికి ఎంతో ఇష్టమైన పట్టు చీరలను ఆమె త్యజించారు. పట్టుపురుగుల కోకూన్లకు హాని కలుగుతుందని పట్టుచీరలను నిరసించారు .
ఆమె ఒక జంతు హక్కుల కార్యకర్త కూడా! పట్టుపురుగులకు హాని కలగకుండా రూపొందించిన చీరలను ధరించడాన్ని ఆమె ప్రోత్సహించడం వలన అహింస సిల్క్ ప్రజాదరణ పొందింది .
అంతేకాదు సాంకేతికతను మరింత అభివృద్ధి చేయడానికి పారిశ్రామికవేత్తలను ప్రేరేపించింది.
పేటెంట్ పొందడంతో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ తన వేగన్ వైల్డ్ సిల్క్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం ప్రారంభించింది . చురుకైన ప్రథమ మహిళగా రాష్ట్రపతి కార్యాలయం నుండి వచ్చిన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి బాధ్యత వహించింది .
ఇన్ని రకాలుగా సేవ లు చేసినా , తన భర్త జీవితం గురించి ఒక డాక్యుమెంటరీ తీసినప్పుడు జానకి గారి ని ఒకే ఫ్రేమ్లో చేర్చినప్పుడు ఆమె చిత్రాన్ని తొలగించమని అభ్యర్థించింది.
ఇంత సేవ చేసిన ఆదర్శ మహిళా మాణిక్యంగా జానకీ వెంకట్రామన్ గారిని వేనోళ్ళ కొని ఆడదాం.