అమెరికా బతుకమ్మ

         డా. విజయలక్ష్మీ

మన తెలంగాణ బతుకమ్మ

అమెరికా ప్రకృతి తన అంద చందాలతో రంగులు పులుముకొన్నది
వనాలతో వానజల్లుల మబ్బులతో
మసకేసిన సూర్యచంద్రుల నీడలో
నిలువునా నిలిచి రంగులు వెదజల్లే వనదేవతే మన బతుకమ్మల సమూహం.
వృక్ష సంపదతో తులతూగుతూ ఈ ప్రకృతి తల్లిగవెలసి,ఈ ధాత్రిగ
నిలసిన తల్లే బంగారు రంగుల బతుకమ్మ

ఎటుచూసినా గుట్టలు, దిబ్బలు,రహదారులు,రైలుట్రాకులు,
రంగురంగులతో ఉద్యానవనాలలో వెలిసిందా అన్న ఆహ్లాదంగా
అమెరికా అంతటినీ ఆవరించిన బతుకమ్మ మన తెలంగాణ బంగారు బతుకమ్మ

తంగేడుల పసుపు, పట్టు కుచ్చుల ఎరుపు, గునుక పువ్వుల తళతళలు
అన్నీ ఒకే దగ్గర గుట్టలు గుట్టలుగా ,
కట్టలు కట్టలు గా బారులుదీరినట్టునై ఈ ప్రకృతి బతకమ్మలు
మనకు తెలియకుండనే ఎన్నో ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చేసిన
మన తెలంగాణ బతుకమ్మ – ఆకులు రాలే కాలంలో అమెరికా లో
ప్రకృతి మనకిచ్చిన తెలంగాణ బంగారు బతుకమ్మ

ఫాల్సకలర్ పేరుతో
భూతల్లే తాంబాలంగా
ఆకాశమే అందమైన శిఖరంగా
చెట్ల పుప్పొ డే గౌరమ్మలా
అమెరికాకు సత్తు-ముద్దలతో
సకల వైభవంగా రంగురంగుల ఆకులతో ,పూలతో
ఈ పుడమిని పులకితలు పెడుతుంది మన బతుకమ్మ
అమెరికా ప్రకృతి మనకిచ్చిన
మన తెలంగాణ బంగారు బతుకమ్మ!

Written by Dr vijaya Laxmi

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తీరని కల తీరింది

ఉషోదయం