తీరని కల తీరిందిఅవును.ఎప్పుడూ తల్లిదండ్రులు పిల్లలకు కానుకలు ఇవ్వటమే!వారికోసం తమ జీవితమంతా ధారపోయటమే! కష్టాలన్నీ భుజాలన ఎత్తుకొని సుఖాలన్నీ వాళ్ల పాదాలు చెంత చేర్చటమే.ఎన్నాళ్ళైనా ఇంతే! పిల్లలు పెద్ద వాళ్ళు అయినా అదే పరిస్థితి.వాళ్ళు లక్షలు లక్షలు సంపాదిస్తున్నా అందులోమార్పు ఏమీ ఉండదు.
ఎందుకిలా?ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు.
ముగింపు మాత్రం ఉంటుంది.అది పిల్లలు పెద్దవాళ్ళై ఆస్థానంలోకి వచ్చాక మాత్రమే అది అర్థమవుతుందని. కానీ ఏం లాభం? అప్పటికి అంతా అయిపోతుంది. ఏదైనా చేద్దామన్నా కళ్ళ ముందు దండ వేసిన ఆ తల్లిదండ్రుల ఫోటోలు తప్ప మరేమీ ఉండదు.
సైకిల్ చక్రంలా ఇలా తల్లిదండ్రులు వ్యవస్థ,పిల్లల ప్రవర్తన గిరగిరా తిరుగుతూనే ఉంటుంది. జీవితం వెళ్ళిపోతుంది.మళ్లీ పుట్టటం మళ్ళీ గిట్టటం ఇంతకంటే ఏ మార్పు ఉండదు అనుకున్నా ఇన్నాళ్ళూ.
కానీ ప్రక్కింట్లో ఓ బిడ్డ వాళ్ళ నాన్నకు తన మొదటి సంపాదనతో మోటార్ సైకిల్ కొనిపెట్టినప్పుడు నా కళ్ళల్లో ఆనంద భాష్పాలు తిరిగాయి. అతను నా బిడ్డ కాకపోయినా.ఎందుకంటే అతను తిని తినక ఆ బిడ్డని ఎలా పెంచాడో జీవితం అంతా చూస్తూనే ఉన్నాను. మోటార్ సైకిల్ కొనుక్కోవాలన్నది అతని జీవిత కల. కానీ పిల్లాడి ఆలనా పాలన అవసరాలు తీర్చడంతోనే అతని జీవితం వెళ్ళిపోయింది.రేపో,ఎల్లుండో రిటైర్ అయ్యే వయసు.ఇప్పుడు అలాంటి సమయంలో ఇదే అతనికి అనుకోని ఊహించని బహుమతి.అదీ తన కొడుకు ద్వారా! ఇంతవరకు తండ్రులు కొడుకులకి అలా కొనిపివ్వటమే చూశాను.అలా ఓ కొడుకు తండ్రికి ఇవ్వటం నా కనులారా చూడటం తో నా తీరనికల తీరిపోయింది.
అందరు బిడ్డలూ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది?వాళ్ల త్యాగానికి ఫలితం ఉంటుంది.
కానీ నిజమైన త్యాగం ఫలితాన్ని కోరుకోదుగా!
సమాప్తం
యలమర్తి అనూరాధ
హైద్రాబాద్
చరవాణి:924726౦206