జీవించు, జీవించు, జీవించు

              మాధవపెద్ది నాగలక్ష్మి

జీవించు, నూరేళ్ళు పూర్తిగా జీవించు, ఎవరి కోసం జీవించాలని అనుకోకు.

నీ కోసం, నీ ఉన్నతి కోసం జీవించు, నీ ఆత్మ పరిపక్వత కోసం జీవించు.

ఉద్ధరేతం ఆత్మానాం అన్నారు కదా? నీ ఆత్మను నీవు ఉద్ధరించుకో.

నాకెలా సాధ్యం అనుకోకు. చదువుకుంటే కదా చదువు వచ్చేది. ఇప్పటివరకు కొంత సాధించావు కదా.

ఇపు్పడు నీకు ఎందుకు బ్రతకాలి? ఈ జీవితానికి అర్థం ఏమిటి? అన్న ప్రశ్న వచ్చింది కదా? ఇది ఇంతకుముందు రాలేదు కదా? ఈ ప్రశ్ననకు జవాబు వెతుకుతున్నావు కదా? ఇది ఒక అడుగు ముందుకు కదా? పుట్టుకతోనే ఆత్మజ్ఞానం రాదు కదా?

కొందరు మహానుభావులకు వస్తున్నది కదా? అంటావేమో అది ముందరి జన్మల పొడిగింపే.

ముందు జన్మలలో 90% పూర్తి చేసుకుని, 10% శాతం కోసం వచ్చినవారు వీళ్లు. మనం 10 % శాతం పూర్తి చేసుకుని 90% శాతం కోసం వచ్చినవాళ్ళము.

L.Kgలో చదివిన వివరాలు, మూడో క్లాసులో ఉండవు కదా. కొత్తవి ఉంటాయి. అలాగే మూడో క్లాసువి పదో క్లాసులో ఉండవు. అయినా Lkg లో చదువుకున్న ఎ ఫర్ యాపిలం పదో క్లాసులో కూడా గుర్తు ఉంటుంది కదా.

10th క్లాసుకి ఇంకా పట్టుదలగా చదివి, ఐ.ఐ.టి కి అర్హుడవు కదా? అలాగే జన్మలు కూడా. పట్టుదలగా పుట్టంగా పుట్టంగా జ్ఞానము వికసిస్తుంది. తెలియకుండానే మనకు పాతవాసనలు ఉన్నందున ఈ జన్మలో ఎందుకు పుట్టాము ? అన్న ప్రశ్న కలుగుతుంది. ఏమిటీ జన్మ ఉపయోగం అనిపిస్తుంది.

అది కూడా రానివాళ్ళు ఈ ప్రపంచంలో కోట్లాదిమంది ఉన్నారు. వారు ఇంకా L.kg వారు. కాబట్టి మనం బ్రతకాలి. వంద ఏళ్ళు. ఎందుకు అంటారా?

ఇంకా కొన్ని అనుభవాలు పొందటానికి. కొన్ని అవాంతరాలు చూడటానికి. లేకుంటే మళ్ళీ ఇవి అనుభవించటానికి మరో పుస్తకం చదవవలసి వస్తుంది.

జీవించి ఉండబట్టే కదా? కరోనా భయం తెలిసింది.

దానితో ఏకాంతం విలువ తెలిసింది. అందరిలో భక్తి భావం పెరిగింది. వ్యయామాలు పెరిగాయి, యజ్ఞ యాగాదుల విలువ ఎక్కువయింది. జనం పూజలతో తరించారు. భజనలు పెంచారు.

ఉ్రకెయిన్ యుద్ధంలాంటి భయంకర వాతావరణం చూశారు. ఆ ప్రజల బాధలు చూసాక మన జీవితం ఎంత గొప్పదో అర్థమయింది కదా?

అది కాదు, ఇది లేదు, ఊళ్ళు తిరగలేదు, నగలు వేయలేదు అన్న భ్రమలు తొలగి, బ్రతుకులు ఇలాగా కూడా ఉంటాయి కదా? అన్న జ్ఞానం వచ్చింది కదా.

బ్రతికి ఉంటే కదా కెజిలో పాఠాలు గుర్తువచ్చినట్లుగా మన పాత తప్పులు, ఒప్పులు గుర్తు వచ్చేది.

అదృష్టము ఉంటే అవి తలచుకుని, బుద్ధి, జ్ఞానము పెరగవచ్చు కదా? అందుకని జీవించు నూరేళ్లు.

అలాగని నిస్సారంగా, భారంగా జీవించకు. ఆనందంగ, యోగిలా జీవించు. అలాగని కాషాయబట్టలు కట్టి, గడ్డాలు పెంచి ఇంట్లో వాళ్ళను వదలక్కరలేదు. బయటివాళ్లను భయపెట్టక్కరలేదు. నీ ఇంట్లో నీవు ఉండు. అన్నీ అనుభవించు. నిస్సారమువద్దు. ఆనందం పంచు. ఇంట్లో అందరికి సహాయం చేయి. నీ జ్ఞానం నీ కోసం పెంచుకో. సహాయం చేయాలని ఆశ్రమాల చుట్టూ తిరగక్కరలేదు. ఇంట్లో పిల్లలు, ముసలివారిని వదిలేసి, సేవచేయటానికి ఆశ్రమం వెళ్లేవారు ఎందరో? వీరందరు ఎందుకు వెళ్తున్నారు? ఏదైనా అదృష్టం కలసి వస్తుందేమో గురువు దగ్గర ఉంటే అని. గురువు ప్రకక్కన నిలుచుంటే గురువు అంతవాడు కాలేడు. ధనవంతుని ప్రక్క నిలుచుంటే ధనవంతుడు అవుతాడా?

ధనవంతుడు ఎంత కష్టపడి ధనం సంపాయించాడో తెలుసుకుని అంత కష్టం నీవు చేస్తే ధనవంతుడవుతావు. అలాగే గురువు ప్రక్కన ఉంటే జ్ఞానం రాదు, ఆ గురువు ఎంత తపస్సు చేసి ఆ స్థితికి చేరుకున్నారో తెలుసుకుని నీ నిజ జీవితంలో అంత కష్టపడి సాధిస్తే నీవు జ్ఞానివి అవుతావు. ఏ గురువు ఇల్లువాకిలి, పిల్లలు, ముసలివారిని వదిలివచ్చి ఆశ్రమంలో ఉండి తమను సేవించమని చెప్పరు.

ఇది నీకు నీవు కల్పించుకున్న భ్రమ. పేరు కోసం, మెప్పు కోసం చేస్తున్న ఆర్భాటం. ఈ మెప్పుల కోసం ప్రాకులాడకుండా నీవు నీ ఇంటిని చక్కదిద్దుకో.  తల్లి దండ్రులకు, అత్తమామలకు సేవచేయి. నీ పిల్లలకు, సద్బుద్ధులు, క్రమశిక్షణ నేర్పి మంచి భావి భారత పౌరుల లాగా తయారుచేయి. వాళ్ల కష్ట సుఖాలలో అండగా నిలబడి, తగిన సలహాలు ఇయ్యి. నీ పని నీవు చేసుకో. లోపల జ్ఞానం పెంచుకో. ఇంకా కొన్ని అనుభవాలు పొందు. ఇంకా కొన్ని సంతోషాలు చూడు. ఇంకా కొన్ని అనర్థాలు చూసి, అజ్ఞానం వదిలించుకో.

వీటితోనే నీ ముందు జీవితానికి మంచి బాటలు వేసుకో. ఇంకా కొన్ని జన్మలు తగ్గవచ్చు. 80 జన్మలు ఉంటే 20 జన్మలలో ముక్తి రావచ్చేమో? ఎవరు చెప్పగలరు భవిష్యత్.

మొక్క బాగా పెంచితే పెద్ద వృక్షం అవుతుంది. లేకుంటే ఎండిపోతుఁది. జీవితం కూడా అంతే.

అది నీ చేతిలోనే ఉంది. అందుకని జీవించు. నూరేళ్ళు జీవించు. జీవితం సార్థకం చేసుకో. ఏదీ ఆశించకు. వచ్చేదాన్ని ఆపకు. పోయేదాన్ని పట్టుకోకు. ఇదే జీవిత పరమార్థం?

మంచానపడి నూరేళ్లు జీవిస్తే ఎలా అంటావా? వ్యాధి బారినపడటం మన చేతిలో లేదు కదా?

అప్పుడు కూడా నీ మనసులో జ్ఞానం పెంచుకో. ఎవరిమీద అహంకారం పడవాకు. శాంతిగా ఉండు.

ఇది ాపూర్వజన్మ ఖర్మ, ఈ జన్మలో వదిలించుకుంటా అనే దృఢనిశ్చయంతో లోపల భగవన్నామన స్మరణ చేసుకో. ఎదుటివారికి బాధ అనుకోకు. అది వారి క్రిందటి జన్మ ఖర్మ. వారు ఎలా చూసినా భరించు. వారి చెడు కోరుకోకు. ఇదే జీవిత పరమార్థం. ఇదే నగ్న సత్యం. జీవించు జీవించు.

మంచంలో ఉండి మనసు భగవన్నామస్మర చేయలేకుంటా అప్పుడు కూడా నీ లోపలి ఆత్మ పనిచేస్తూనే ఉంటుంది. అందుకే ముందు నుంచి లోపల భగవత్ చింతనతో ఉంటే మంచంలో ఉండి కూడా అవే గుర్తుకు వస్తాయి. భగవన్నామస్మరణలో ఆత్మహాయిగా మేలుకుంటుంది. అందుకే జీవించు, జీవించు,

ఆత్మహత్యలు చేసుకుని, మరుజన్మలో దయ్యాలలాగా పుట్టవద్దు. కష్టాలు ఎదుర్కో. ధైర్యం పెంచుకో, ఉపాయాలు వెతుక్కో. విజయం సాధించుకో. అందుకే జీవించు జీవించు

శతమానం భవతి అన్నారు కదా పెద్దలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నీకు మేమున్నాం…

ఏమంటున్నది ప్రకృతి