శ్రీ మతి మమతా రఘువీర్ 1999 లోనే తరుణి అనే స్వచ్ఛంద సంస్థ ను నెల కొల్పి రిజిస్టర్ చేయించారు.బాల్యం లో అమ్మ నాన్నల సేవాభావం ఈమె హృదిలో నాటుకుపోయింది.క్రమంగా మల్లెతీగె లాగా పైపైకి సాగి భర్త శ్రీ రఘువీర్ గారి ప్రోత్సాహంతో శాఖోపశాఖలుగా విస్తరించింది.తరుణి నిగూర్చి రాయాలి అంటే రోజు కో కాలమ్ వచ్చేలా రాయవచ్చు.కానీ నేను ఆమె తల్లి తండ్రుల ప్రోత్సాహం సత్యసాయి బాబా ఆశీస్సులు ఆమెకు లభించటం ఆమె అంచెలంచెలుగా ఎదిగిన వైనం గురించి తెల్పుతాను.
వైద్య సదుపాయాలు అంతగా లేని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టారు మమత! ఆమె మేనమామ శ్రీ పాలకోడేటి జగన్మోహన్ గారు అప్పుడు నల్గొండ జిల్లా ఎస్.పి.ఆమెతండ్రి కొడంగల్ లో మున్సిఫ్ మేజిస్ట్రేట్! అస్సలు వైద్య సదుపాయాలు లేని పల్లె ఆరోజు ల్లో! తల్లి విద్యావంతురాలు కావటంతో 1976లో కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది.పిల్లల చదువు సంధ్యలు ఆమె చూసుకోటంతో తండ్రి ట్రాన్స్ఫర్ లమీద వివిధ ప్రాంతాల్లో తిరిగారు.తండ్రి అనంతపురం లో ఉద్యోగం చేస్తున్న రోజు లవి. సెలవుల్లో కుటుంబ మంతా పుట్టపర్తి వెళ్లింది.సత్యసాయిబాబా చిన్నా రి మమతను “సేవచేస్తావా బంగారూ?” అని అడిగితే జవాబు చెప్పడం తెలీని పసిమొగ్గ మమత! కానీ అమ్మ ప్రేరణ తో తరుణి కి మనసులో బీజం పడింది.సెయింట్ థెరిసా కాన్వెంట్ లో 10వక్లాస్ దాకా చదివి స్కూల్ పీపుల్ లీడర్గా రాణించిందామె! ఆమె 8వక్లాస్ లో ఉండగా క్లాస్మేట్ కింద పడటం మోకాలి గాయంకి మమ…
ఫస్ట్ క్లాస్ లో టెన్త్ పాసైన ఆమె స్టాన్లీ బాలికల కాలేజీ లో చేరారు.లూనా పై వెళ్తున్న ఆమె చున్నీ ని ఎవరో లాగారు.అందుకే తల్లి ఆమెకు కరాటే నేర్పించారు.మమత ఐదు కరాటే బెల్టులు పొందారు.మానసికధైర్యం ఆత్మ విశ్వాసం పెరిగాయి.అనవసరంగా ఎవరైనా ఏదైనా అంటే ఎదుర్కొనే సామర్థ్యం కలిగింది.డాన్స్ నేర్చుకోవాలి అనే కోరిక తీరలేదు కాని వీణలో ప్రవేశం ఉంది.డాక్టర్ కావాలి అని ఆమె కోరిక! పుట్టపర్తి వాతావరణం ఆమెను బాగా ఆకట్టుకుంది.తన కోరిక ను బాబాకి చెప్పిన మమతకి ఆయన లాకెట్ సృష్టించిఇచ్చారు.మెడిసిన్ ఎంట్రన్స్ టెస్ట్ లో పాసై ఉంటే ఆమె కేవలం డాక్టర్ మమత గా ఉండిపోయే వారు.నిరాశ పడక నిజాం కాలేజీలో బి.ఎస్సీ.జెనెటిక్స్ ఎం.ఎస్సీ బాటనీలో ప్లాంట్ జెనెటిక్స్ ఫస్ట్ క్లాస్ లో పాసైనారు.1989లోఐ.ఎఫ్.ఎస్. శ్రీరఘువీర్ గా రితోపెళ్లి ఇంకో ఘట్టం! భర్త తో నిజాం బాద్ వెళ్లి నా మమత శ్రీ మతి సుమన్ కృష్ణ కాంత్ నెలకొల్పిన మహిళా దక్షతసమితిలోచేరారు
శ్రీవారి కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావటంతో ఉస్మానియా యూనివర్సిటీ లో పి.హెచ్.డి.చేశారు.కొడుకు పుట్టిన తర్వాత కూడా ఆమె GhMc లోIPP8 అనే ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు లో 5ఏళ్లు పని చేశారు.సమాజసేవపై దృష్టి మళ్ళింది.హైదరాబాద్లోనే స్థిరపడ్డారు.మురికివాడలకు వెళ్లి దీనహీనస్థితిలో ఉన్న ఆడపిల్లలు స్త్రీల సమస్యల్ని బాగా అర్ధం చేసుకుని చురుకుగా సంఘసేవ లో పాల్గొన్నారు.ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా ఆరోగ్య సమాచారాన్ని పౌష్టికాహారం శుచి శుభ్రత వారి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేశారు.10వేలమంది బాలికలతో మేళా నిర్వహించారు.సాంస్కృతిక ప్రోగ్రాం లు ద్వారా మహిళలలో చైతన్యం తెచ్చారు.భర్తకి వరంగల్ ట్రాన్స్ఫర్ కావటంతో మమత స్వయంగా ప్రభుత్వ బడులకు వెళ్లి బాలికల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.పల్లె పల్లెకు తిరిగి బాల యువతుల వృద్ధుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఆరో క్లాస్ తో చాలా మంది ఆడపిల్లలు బడిమానేసి పెళ్లి కావటంతో ఎదుర్కొంటున్న సమస్యల్ని ఈమె బాగా స్టడీ చేశారు.రాజేశ్వరి అనే పాప పెళ్లి ఆపించి నలుగురి దృష్టిలో పడ్డారు.ఆమెపై నమ్మకం ఏర్పడింది జనాలకి.”ఒకచోట నేలను బవ్వళించు..నొకచో నొప్పారు బూసెజ్జపై..అన్నం విధంగా సాగింది ఆమె యాత్ర! ఆడపిల్లల బడికి స్వయంగా ఛార్ట్స్ తయారు చేసి చిట్కలు కథల రూపంలో కాజీపేట ప్రభు త్వ బాలికల హైస్కూల్ లో 6-10క్లాసుల పిల్లల కి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఆడపిల్లల్లో రక్తహీనత పోగొట్టాలి అని తన సొంత ఖర్చులతో మొలకెత్తిన గింజలు అరటిపండ్లు పల్లిపట్టీలు పేపర్ ప్లేట్లో పంచేవారు.మొదట్లో టీచర్స్ తమ టైం వెస్ట్ అవుతోందని సిలబస్ పూర్తి కావాలని చెవులు కొరుక్కునేవారు.కాని పట్టుదలతో10బడులలోవెయ్యి మంది బాలికలకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు.
ఒక బాక్స్ లో పిల్లలు తమ సందేహాలను రాసి చీటీ అందులో పడేస్తే అవి చదివి మమత సందేహనివృత్తిచేసేవారు.ఇంట్లో ఆడపిల్ల పై దాష్టీకం లైంగిక వేదింపులు కూడా పరిష్కరింపబడినాయి. 8వక్లాస్ పిల్లల వాలీబాల్ ప్లేయర్ నెల తప్పడం మమత సకాలంలో అబార్షన్ చేయించిన ఆమె జీవితం లో వెలుగులు నింపటం మర్చిపోలేని అనుభవం
మమత బయోలాజికల్ సైన్సెస్ లో పి.హెచ్.డి.చేశారు.లా డిగ్రీ సోషల్ వర్క్ లో మాష్టర్స్ డిగ్రీ పొందారు.కెనడాకి చెందినcoady International
Institute of Social sciences లో ఫెలోషిప్ పొందిన అంతర్జాతీయ నల్గురు మహిళలలో ఈమె ఒకరు.రష్యన్ భాషలో సీనియర్ డిప్లొమా చేశారు.2009లోఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రాం కి యు.ఎస్.ప్రభుత్వ ఆహ్వానం పై హాజరైనారు.జమ్షెడ్జీ టాటా ట్రస్ట్ నుంచి దక్షిణ భారతదేశంలో బెస్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అవార్డు అందుకున్నారు.
భరోసా ట్రాన్స్ పీపుల్ ప్రొటెక్షన్ సెల్ ఈమె సాధించిన విజయం! నెట్ వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీగల్ యాక్టివిస్ట్
NILAనినడుపుతున్నారు.ఇలా బాలికల స్త్రీల సమస్యలతో మొదలైన ఆమె సేవా కార్యక్రమాలు రోజు రోజుకు విస్తరిస్తూ ఎంతోమంది కి చైతన్యం స్ఫూర్తి ని ఉత్సాహం ని కల్గిస్తున్నాయి.రేడియోలో ఈమె ప్రసంగాలు పరిచయం ప్రసారం ఐనాయి.తాను గృహిణి గా తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూ తన ఆశయాన్ని సఫలం చేసుకుంటున్న ఆదర్శ తరుణి శ్రీమతి మమత రఘువీర్ తెలుగువారి తేజం! ఆదర్శ నారి.అంతర్జాతీయస్థాయిలో రామన్ మెగసెసే అవార్డు మనదేశంలో పద్మ పురస్కారాలు అందుకోవాలి అని ఆశిద్దాం