ఆకాశ హర్మ్యాలు ఆనంద తీరాలు
మనసు ఒక విచిత్ర సరోవరం
మనం వికసిత సరోజాలమైతే చాలు!
నాలుగు వేళ్లు మూడుపూటలు నోటి కంది
ముఖపద్మంపై నవ్వులు వెలసిన
ప్రేమైక జీవులకు
పూరి గుడిసె అద్దాల సౌధం
మనసు వాకిలిలో నిశి రాత్రులు తారాడనప్పుడు
చీకటి ఆమడ దూరం
చిత్రాల కందని హృదయ భావాలు
కష్టజీవి కనపడకున్నా
కళ్ళముందు కనిపిస్తుంది
ఏం త్యాగాల భవనాల అక్కరలేదు
ఈ భువన విజయాలలో
కవితా సౌరవాలంందించిన చాలు
కలిమి తరగని దాన గుణం మనదైతే చాలు!
ప్రేరణ ఒక చిన్న బతుకు కథ అయితే చాలు!!
– డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు
నమస్తే నీహారిణి గారూ!నేను సుగుణ …. హైదరాబాద్ లో పుట్టి పెరిగి జీవితం మొత్తం ఇక్కడే గడిపాను. పాత బస్తీలో పాఠశాల చదువు చదివి , పెళ్లి చేసుకొని పట్నం లో అడుగు పెట్టి, చదువు కొనసాగించాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు MA పూర్తిచేసాను.తెలుగు అధ్యాపకురాలిగా 30 సంవత్సరాలు చేసి ప్రస్తుతం ఇంటిని ఒంటిని భర్తను చూసుకుంటున్నాను.మీ పరిచయం చాలా ఆనందాన్నిచ్చింది…. కృతజ్ఞరాలిని🙏