రెండు తీరాలు
ఒక భావ ప్రవాహం
కలవని దారులు వెదుకుతూ
ఈ కలగాని ఉదయపు వేళ
ఏదో మెరుపు తీగలా
నేను నా పరాకు చిరాకు
కారాడవి దాటి
పట్టలేని ఆనందం కోసం
బ్రతుకు మెట్లని ఎక్కే అవకాశం
భావి గుమ్మం ముందు మాటల
మూటలతో
ధైర్య సాహసాల వెలుగు కాగడాలతో
కలల దారిలో కొత్త రూపురేఖల
చుక్కల ఆకాశం లా
చమక్కుల అవసరాలలా
నేల రాలిన పూలు
నేడు రాలని పూలు
మేధోమథనం చేస్తూ
మలుపులో
మరుపుల్లో ….
కొత్త వెలుగుల ప్రస్థానంలో….
కన్నులో అవి దీపాలో …
_ డా. కొండపల్లి నీహారిణి,
తరుణి సంపాదకులు.