చెట్టు నీడ ( కథ )

ఆకాశంలో. పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతున్నా యి.చల్లని చిరుగాలులు మెల్లిగా వీస్తున్నా యి.డాబా మీద
వాలు కుర్చీ లో కూర్చు ని
వున్న గౌతమి పైకి ఏకదీక్షగా చూస్తుంది. చూపులు నీలాకాశం వంక చూస్తున్నా ,ఆమె మనస్సు . మాత్రం ఎక్కడో
విహరిస్తున్నట్టుగా వుంది.
ఆమె జ్ఞాపకాలు మాత్రం రఘు రామ్ చుట్టే తిరుగుతున్నా యి. ఇవాల్టి కి సరిగ్గా ఆరు మాసాలు అవుతుంది
అతను కన్పి ంచి.ఈమధ్య కాలంలో ఎక్కడా ఒకసారి కూడా కన్పి ంచలేదు. బహుశా, కంపెనీ తరుపున ఏదేశానికైన
వెళ్ళడేమో ! అయినా అతనెక్కడ కి
వెళ్ళి తే తన కెందుకు ? కాకతాళీయం గా పరిచయమైన
అతన్ని గురించి తానెందుకు ఇంతలా ఆలోచించడం
అవసరమా ? కనీసం ,ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు.చివరికి తానే ఎన్నో మార్లు ఫోన్ చేసినా రెస్పా న్స్ లేదు అలాంటి
అతని గురించి తాను ఎందుకు ఇలా ప్రతిరోజు ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవడం’
అనుకుంటూ మెల్లగా అక్కడినుంచి లేచింది.
అంతలోనే వాళ్ల అత్తయ్య కింది నుంచి కేకేసింది ..
“అమ్మా య్ , ఎక్కడున్నా వ్ ? నీకు ఎవరో ఫోన్ చేస్తున్నా రు..” అంటూ.
ఆ మాట వినగానే ” ఆ , వస్తున్నా నత్తయ్యా ” అంటూ గౌతమి గబగబా కిందికి దిగి వచ్చి ంది.
అప్పటికే ఫోన్ మోగడం ఆగి పోయింది.మిస్డ్ కాల్ చూసింది. ఎవరిదో కొత్త నెంబర్. ‘ఎవరో, అవసరం అయితే వాళ్ళే
మళ్ళీ చేస్తారు లే ‘ అనుకుంటూ వుండి
పోయింది.
వంటింట్లో వున్న మధుమతి , కోడలు మౌనం గా వుండ్డం
గమనించి ” ఎవరమ్మా ఇందాక ఫోన్ చేసింది “అడిగింది.
” ఏమో , తెలియదు అత్తయ్యా ! మరే, మన బాబు
కన్పి ంచడం లేదింట్లో…. ఎటైన వెళ్ళా డా? ”
” ఇందాక నే పాలు తాగినాక మీ మామయ్య వాడ్ని తీసుకొని పార్కు కు వెళ్ళా డమ్మా !”
” అవునా ,మరి గోపీ కృష్ణ కూడా ఇంకా ఇంటికి రానట్లుంది కదా అత్త య్యా ? ” మరిదిని గురించి అడిగింది.
” ఈరోజు వాడు ఆఫీస్ నుంచి నేరుగా కొత్తింటికి వెళ్ళు తున్నా ని ఫోన్ చేసి చెప్పా డు. అక్కడ ఆ ఇంట్లో టైల్స్
వేస్తున్నా రట. దగ్గరుండి చూడకపోతే వాళ్ళ కు
తోచినట్లు గా. వాళ్ళు వేస్తారని మీ మామయ్య ఉదయం వెళ్ళి , గోపి అక్కడికి వచ్చా కనే ఈయన ఇంటికొచ్చా రు.
గౌతమీ ! ”
“అవునా, కాంట్రాక్టర్లకు ఇచ్చా క అన్ని వాళ్ళే దగ్గర వుండి సక్రమంగా చూసుకోవాలి కదా అత్తయ్యా .”
” ఈరోజుల్లో అంత న్యా యంగా పని చేయాలని ఎవరు అనుకుంటారమ్మా ?
” అలా న్యా యంగానే చేయాలనే కదా అత్తయ్యా మనం
కాంట్రాక్టర్ కు ఇచ్చి ంది.”
“మట్టికైన ఇంటి వాడు వుండాలని , వెనుకటి కి
పెద్దలు ఊరికే అనలేదు.పెద్దాడే వుండి వుంటే
ఈపాటికి ఎప్పు డో క్రొత్త ఇంట్లో వుండే వాళ్ళం మనం .”
కరోనా తో చనిపోయిన పెద్ద కొడుకు ను గుర్తు చేసు కుంటున్న మధుమతి కళ్ళు చెమ్మగిల్లాయి.కంఠం గద్గదికమైంది.
అత్తగారలా భర్తను గుర్తు చేసేసరికి గౌతమి మనస్సు గూడా దుఃఖభరితమై పోయింది. అక్కడ వుండ లేనట్లు గా
వడివడి గా తన గదిలోకి వెళ్ళి పోయింది.
కోడలు వెళ్ళి న వైపే చూస్తూ ఆవిడ బాధతో దీర్ఘంగా నిట్టూర్చింది.
ఆవిడకు ఒక్క సారిగా గతమంతా గిర్రున కళ్ళ ముందు గిర్రున తిరిగసాగింది.
*** *** ***
మధుమతి ఆదినారాయణ దంపతులకు ఇద్దరూ మగ
పిల్ల లే. పెద్ద వాడు మురళీ కృష్ణ , చిన్న వాడు గోపీకృష్ణ.
చదువు పూర్తయి ఉద్యో గం లో చేరగానే మురళీకృష్ణకి
పెళ్లి చేయాలని అనుకున్నా రు పెద్దలు. అప్పటికే తాను
ప్రేమించిన అమ్మా యి గౌతమి విషయం తల్లి తండ్రులకు
చెప్పా డు. వాళ్ళు కూడా మంచి వాళ్ళే కాబట్టి, కొడుక్కి
ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. వాళ్ళు కొడుకు మనసెరిగి తను ఇష్టం పడిన అమ్మా యిని పెళ్లి చేసుకో వడానికి
మనస్ఫూ ర్తిగా ఒప్పు కున్నా రు.
గౌతమికి చిన్న తనంలో నే తల్లిదండ్రులు. ఓ రైల్ యాక్సీడెంట్ లో చనిపోతే,
మేనమామ దగ్గరే పెరిగి విద్యా బుద్ధులు
నేర్చు కోవడం వలన…తాను చదివిన చదువు కు తగిన
ఉద్యో గం వచ్చీ రాగానే అందులో చేరిపోయింది గౌతమి.
అన్ని లాంఛనాలుతో గౌతమి మేనమామ దేనికి లోటు లేకుండా వాళ్ళ పెళ్ళి ఘనంగానే చేశాడు.ఆమెను అత్తా
రింటికి పంపించి తమ బరువు బాధ్యతలు దించుకున్నా డు.
కొన్న తల్లి దండ్రులుగా ప్రేమానురాగాలతో చూసుకునే
అత్తా మామలు, మనసెరిగిన భర్త, ఆప్యా యంగా మాట్లాడే మరిది…మొత్తం మీద గౌతమి కొత్త కాపురం
మూడు పూవులు ఆరు కాయలుగా నందన వనంలా సాగి
పోతుంది.
ఓ ఏడాది తిరిగే సరికి గౌతమికి పండంటి బిడ్డ పుట్టాడు. మధుమతి ఆనందం అంతా ఇంతా కాదు. మనవడిని ఎంతో
అపురూపంగా ఇంటిల్లిపాదీ చూసుకునే వారు.ఆ ,కుటుంబంలో ఆనందోత్సా హాలతో కాలం ముందుకు పోతుంది.
బాబు పుట్టాక మురళీ కృష్ణ కు అదృష్టం బాగా కలిసొచ్చి ంది. మంచి సెంటర్ లో రెండొందల గజాల ఇంటి
స్థలం కొన్నా డు. త్వరలో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలి
అని తన ఆలోచన కుటుంబ సభ్యు లకు కూడా తెలిపాడు. అందరూ ఎంతగానో సంతోషించారు.కానీ, మనం
అనుకున్నది అనుకున్నట్లుగా
జరిగితే కావాల్సి న దేమున్నది ? మనం ఒకటి తెలిస్తే
భగవంతుడు మరొకటి తలచినట్లుగా…,ఆ సంవత్సరంలో అనుకోకుండా ప్రపంచ వ్యా ప్తంగా గడగడ లాడిస్తున్న ‘కరోనా’
మన దేశంలో కూడా ప్రవేశించింది.
పెద్ద పెద్ద నగరాల్లో విజృంభించి.. కుటుంబాల్లో వున్న జనాలను అతలాకుతలం చేసింది.అలాంటి కుటుంబాల్లో
మధుమతి ఆదినారాయణ వాళ్ళ కుటుంబం కూడా ఒకటి.
ఎంతో జాగ్రత్తగా వున్నా మురళీ కృష్ణ,.ఆది నారాయణ
కరోనా బారిన పడ్డం తప్పించుకోలేక పోయారు.
ఎంతో డబ్బు ఖర్చు అయ్యి ంది. కానీ, ఫలితం శూన్యం.మురళీ కృష్ణ పదిహేను రోజుల పాటు మృత్యు వు తో పోరాడి
పోరాడి అలసి పోయి అసువులు విడిచాడు.
ఆది నారాయణ మాత్రం కొద్దిగా కొద్దిగా కోలుకో సాగాడు.
కాని తన పెద్ద కొడుకు మరణించిన విషయం మాత్రం ఆయనకి తెలియజేయలేదు.కొడుకు చావు వార్త వింటే
ఆ షాక్ తో మళ్లీ ఆయనే మన్న అవుతాడేమోనని చెప్పడానికి సాహసం చేయలేకపోయారు.
కుటుంబ సభ్యు లంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
గౌతమిని ఓదార్చడం ఎవరి నుంచి కావడంలేదు.ఆమె
మేనమామ కు ఫోన్ చేశారు. వాళ్ళు ఆ సమయంలో కూతురు దగ్గర అమెరికా లో వున్నా రు.ఫోన్ లో నే
గౌతమిని ఓదార్చా రు.
ఆది నారాయణ డిశ్చా ర్జి అయిన తరువాత మామూలుగా
వున్న సమయంలో పెద్ద కొడుకు కన్పి ంచడం లేదు …ఎక్కడికెళ్ళి నాడనీ , పదే పదే అడుగుతుంటే ఇంట్లో
వాళ్ళకిక చెప్పక తప్పలేదు.
మురళీ కృష్ణ మరణవార్త తెలిసి ఆయన ఓక్షణం స్పృహ తప్పితే ఇంటిల్లిపాదీ ఒక్క సారిగా గొల్లుమన్నా రు. ఆదినారాయణ
నెత్తి నోరు బాదుకుంటూ” వాడికి బదులుగా ఆ కరోనా తో నేను చనిపోయిన బాగుండేది అయ్యో ..దేవుడా ! ” అంటూ
హృదయవిదారకంగా ఘోరంగా విలపించసాగాడు.ఆయన్ని ఆపడం ఎవరికీ సాధ్యంకావడం లేదు.
*** . ***. ***
కాలం ఎవరికీ కోసం ఆగదు. తనంతట తాను ముందుకు
పోతూనే వుంది. మరుపు అనేది మనిషికి
భగవంతుడు ఇచ్చి న గొప్ప వరం.
.ఇప్పడిప్పు డే ఆ కుటుంబం కాస్తా ఆ దుఃఖం సాగరములో నుంచి కొంచెం కోలుకొని ఒడ్డు కు చేరసాగింది..
గౌతమి యథాతథంగా జాబ్ కు వెళ్ళు తుంది.చదువు పూర్తి చేసుకొని గోపీ కృష్ణ కూడా
మంచి ఉద్యో గంలో చేరాడు. బాబుని కుటుంబ సభ్యు లంతా అల్లారు ముద్దుగా చూసుకో సాగారు. కన్నతల్లి కన్నా
నాయనమ్మ తాతయ్య కు బాబు బాగా దగ్గరై పోయాడు.
చిన్న వయస్సు లోనే అలా జరిగినందుకు…కోడలి పట్ల మధుమతికి చాలా సానుభూతి వుంది. ముందు జీవితం ఎంతో
వుంది.మళ్ళీ పెళ్ళి చేస్తే ఎలా వుంటుందా అని ఆ దిశగా ఆవిడ ఆలోచన చేయసాగింది .తన ఆలోచన ను
ముందు గా భర్త కు తెలియజేసింది.
ఆదినారాయణ భార్య వంక ఓ క్షణం ఎగాదిగా చూశాడు.
ఆతర్వా త తల పంకిస్తూ ” బాగానే వుంటుంది కానీ, కోడలి అభిప్రాయం కొనుక్కు ని , మనం ముందుకు
వెళ్ళి తే బాగుంటుందని నా అభిప్రాయం. ” అన్నా డు.
“అవునండీ,అదే ఎలా అడగాలని మధన పడుతున్నా ను.
మనకు కూతురైన, కోడలైన గౌతమే కదా! బాబు విషయంలో ఎలాంటి బెంగ , దిగులు లేదు. ఎందుకంటే
వాడు మనిద్దరి దగ్గర హాయిగా పెరుగుతాడు.తాను మళ్ళీ పెళ్ళి చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుందండీ. బాబు ను
కూడా చూసుకోవచ్చు . ఈ రెండు మూడు రోజుల్లో గౌతమిని అడుగుతాను. తన అభిప్రాయాన్ని తెలుసుకుం
టాను…” అంది మధుమతి.
ఆవిడ అన్నట్లుగానే ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోడలితో తన మనస్సు లోని మాటను నెమ్మదిగా బయట
పెట్టింది.
అత్తగారలా అడిగేసరికి ఏం సమాధానం చెప్పా లో గౌతమి కి అర్థం కాలేదు. విస్మయం గా ఆవిడవంకే అదోలా చూడ
సాగింది.
” నేనడిగినది నిజమే గౌతమీ ! నేను ,మీ మామయ్య
ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా ం. ”
” ఒద్దు అత్తయ్యా ! అలా మా ట్లాడకండీ. నాకు పెళ్లొద్దు.చల్లని చెట్టునీడ నిచ్చే ఈ ఇంటిని వదిలి ఎక్కడికీ వెళ్ళా లని
లేదు. ఒక వేళ…అలాంటి ఆలోచన నాకు
ముందు ముందు వస్తే మీకే చెప్తాను” వినయంగానే అంటూ వడి వడి గా అక్కడి నుంచి వెళ్ళి పోయింది గౌతమి.
కోడలు వెళ్ళి న వైపే అదే పని గా చూస్తూ అచేతనంగా
నిల్చు ండి పోయింది మధుమతి.
*** *** ***
“మధూ!”
“…………”
” ఓ, మధుమతీ! ”
“………….”
” ఓయ్, మందమతీ !”
భర్త కేకలకి ఒక్క సారిగా ఉలిక్కిపడి ఈ లోకం లోకి వచ్చి ందావిడ.
” ఏంటి, ఇన్ని మార్లు పిలిచినా, ఇక్కడే ఉండి పలుకవేం?
నీకు మందమతి పేరే సరిగ్గా సరిపోతుందోయ్!” మనవడి
చెయ్యి పట్టుకుని లోపలికొస్తూ నవ్వు తూ హాస్యంగా అన్నా డు ఆదినారాయణ.
“ఏదో ఆలోచిస్తూ మీ పిలుపు విని పించు కోలేదండీ” భర్త కు సమాధానం ఇస్తూ,పైట చెంగు తో కళ్ళు తుడుచుకుంటూ
లోపలికెళ్లి పోయింది మధుమతి.
” తాతా! బాబా ఇంకా ఇంటికి రాలేదు కదూ! “వాళ్ళ బాబాయ్ గోపీ కృష్ణ ను గురించి బాబు అడిగాడు.
” వస్తాడు. నీవు లోపలి కెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కు ని
నాయనమ్మ ను అడిగి అన్నం తిను.ఈలోగ మీ బాబాయ్
కూడా వస్తాడు…నీవు ఆడుకో వచ్చు ” అంటూ బాబు ను లోపలకి పంపాడాయన.
ఓరోజు మధుమతి తీరిగ్గా భర్త దగ్గరికి వచ్చి వచ్చి
కూర్చో ని చిన్న కొడుకు పెళ్ళి ప్రస్తావన తెచ్చి ంది.
” ఏమండీ, మీరోమారు శాస్త్రి గారి దగ్గరికెళ్ళి రండి.కొత్త
ఇంటి గృహ ప్రవేశానికి ముహూర్తం ఎప్పు డు బాగుందో
అడిగి రండి. సున్నా లు , కలర్స్ అన్ని పూర్తి అయినవి కదా ! అలాగే మన గోపీ కృష్ణకు కూడా ఏదైన మంచి
సంబంధం వుంటే తెలుసుకోండి .కొత్తింట్లోకి వెళ్ళా క, వాడి పెళ్ళి కూడా అయిపోతే మన బాధ్యత తీరిపోతుంది. ”
” ముందుగా అబ్బా య్ అభిప్రాయం తెలుసుకో.పెద్దాడు
లాగ వీడూ ఎవరినైనా ప్రేమించాడేమో కనుక్కో …”
” అలాంటిది ఏమైనా వుంటే వాడే చెప్పేవాడు కదా?”
” ఏమో, ఎవరికి తెలుసు? మురళీ కృష్ణ కూడా అడిగే
వరకు చెప్పలేదు కదా!?”
” సరేలెండి అడుగుతాను. కానీ, మీరు మాత్రం సంబంధాలను గురించి శా స్త్రీ గార్ని అడగడం మర్చిపోకండి” భర్త ను
హెచ్చరించింది.
***. ***. . ***
” హలో, ఎవరు? ”
” నేను రఘురామ్ ని గౌతమీ! గుర్తు పట్టి లేదా? ”
ఒక్క సారిగా గౌతమి గుండె ఝల్లుమంది.
” ఆరు నెలల నుంచి ఓ ఫోన్ కూడా లేదు.మీరు చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళా రు? ”
“నేను ఆఫీసు పని మీద ఆర్నెల్లు ట్రై నింగ్ నిమిత్తం
హటాత్తుగా అమెరికా వెళ్ళా ల్సి వచ్చి ంది. ఎయిర్పో ర్ట్ లో
నా సెల్ పోయింది.నీనెంబర్ లో నాకు నాల్గు అంకెలు
తప్పు మిగితావి గుర్తు లేవు. అందుకని ఫోన్ చేయలేక పోయాను గౌతమి .సారీ, ఏమను కోకు. నిన్నే నేను వచ్చా ను.
ఇంట్లో నాడైరీలో నీ సెల్ నెంబర్ చూసి చేస్తున్నా ను.”
” అవునా! ”
” మనమీరోజు కలుద్దాం గౌతమీ ! నీకు వీలవుతుందా? మీ ఇంట్లోని వారంతా ఎలాగు న్నా రు ? మీ బాబు బాగున్నా డా
? మీ కొత్తిల్లు పూర్తి అయిందా ? ”
” ఆ, అందరూ బాగున్నా రు” అంటూ అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పి,
తాము ఎక్కడ కల్సు కోవాలో కూడా మా ట్లాడుకున్నా రు.
***. . ***. . ***
రెండు మూడు రోజులనుంచి గౌతమి హుషారుగా ఉంది.కారణమేమిటో మధుమతి కి అంతు పట్టలేదు.
ఆఫీసు నుండి వచ్చి రాగానే బాబు తో కాసేపు ఆడుతూ, పక్కన కూర్చో బెట్టుకుని వాడికి అన్నం తిని పించడం లాంటివి
చేయసాగింది.
ఓరోజు గోపీకృష్ణ తండ్రి తో ఇంటి రిజిస్ట్రేషన్ గురించి
మాట్లాడసాగాడు.
” నాన్నా , మీరు ఆధార్ కార్డు మిగిలిన పేపర్స్ అన్ని సిద్ధం చేసుకొని వుండండి. మంచి రోజు చూసుకుని వెళ్ళు దాం”.
” వద్దు గోపీ, తొందరపడకిప్పు డే…ఎందుకంటే ఆ స్థలం
మీ అన్న య్య కొన్నది. ఈ విషయం లో మీ వదిన గౌతమి అభిప్రాయం కూడా తెలుసు కోవడం మంచిది” ఆది
నారాయణ అన్ని మాటలకు మధుమతి భర్త వంక
అదోలా చూసింది.
” మీరేమిటండీ, అలా మాట్లాడుతారు? గౌతమి మాత్రం
వద్దంటున్నందా ఏమిటి?”
” అమ్మా , నాన్న చెప్పినది కూడా కరెక్టే ! వదినను అడిగినాకనే మనం ముందు కెళ్ళు దాం.అన్నట్లు, మీకో
ముఖ్యమైన విషయం చెప్పా లి . వదినింకా ఇంటికి రాలేదు కదా? ” అటుఇటు గదుల వైపు కొంచెం అనుమానంగా
చూస్తూ అన్నా డు.
” రాలేదు గానీ, ఆ ముఖ్య విషయమేమటిరా గోపీ? ” మధుమతి కొడుకుని ఆత్రంగా అడిగింది. ఆదినారాయణ
కూడా ఏం చెప్తాడోన ని కొడుకు వంకే చూడ సాగాడు.
” వదిన ఈమధ్య ఒకతనితో క్లోజ్ గా తిరుగుతుందని మా ఆఫీసులో నా ఫ్రెండ్ ఒకతను నాతో చెప్పా డు. కానీ, నేను వాడి
మాటల్ని నమ్మలేక…తేలిగ్గా కొట్టి పారేశాను. కానీ, నిన్న సాయంత్రం నేను కళ్ళా రా చూశా కనే అది నిజమని
నమ్మా ను.”
” ఏం చూశావ్ ? ” భార్యా భర్తలిద్దరూ ఏక కంఠంతో ఒకేసారి అడిగారు.
” మా ఫ్రెండ్ చెప్పి నట్లుగానే. వదిన అతను ఇద్దరూ కలిసి
ఓ షాపింగ్ మాల్ కు వెళ్ళడం చూశాను. అతని పేరు రఘు రామ్ అని మాఫ్రెండే చెప్పా డు . అతని స్వభావం కూడా
అంత మంచిది కాదని తెలుసట.”.
” మరి అలాంటి వాడితో తిరిగితే ఎలా రా గోపీ? ” ఓక్షణం మధుమతి భయాందోళనలకు లో నైంది.
“అదే, నీ విప్పు డు వదినకు కాస్త నచ్చ చెప్పా లమ్మా .” అని గోపీ కృష్ణ అంటుండగానే …”బయటి నుంచి గౌతమి, బాబు
చేయి పట్టుకొని ఒకతను లోపలికి రావడం
గమనించి గమ్ము న ఆగిపోయాడు.
” అందరూ ఇక్కడ నే వున్నా రు…” అంటూ నవ్వి గౌతమి
తన వెంట వచ్చి న అతన్ని ముందుగా అత్త మామ లకు పరిచయ చేస్తూ,
” ఇతని పేరు రఘు రామ్ మామయ్యా . కొన్నా ళ్ళ క్రితం
నాకు పరిచయం అయ్యా రు.ఆఫీసు పని మీద అమెరికా వెళ్ళి ఈమధ్యే తిరిగి వచ్చా రు” అంది ఉత్సా హంగా.
రఘురామ్ రెండు చేతులు జోడించి చిరు నవ్వు ముఖంతో వినయంగా పెద్ద వాళ్ళకు నమస్కా రం చేశాడు.
” ఇదిగో, ఇతను మా మరిది …గోపీ కృష్ణ ” అని అతన్ని
కూడా పరిచయం చేసింది.
” హలో ” అంటూ సన్ని హితంగా చేయి కలిపాడు రఘు రామ్.
ఆ సన్ని వేశం లో నుంచి ముందుగా తేరుకున్న మధుమతి
” బాబూ! కూర్చో ండి ” అంటూ అతనికి కుర్చీ చూపించింది.
” పర్వా లేదు లెండి” అంటూనే కుర్చీలో
కొంచెం సంకోచం గానే ఆసీనుడై నాడు రఘు రామ్.
“అత్తయ్యా !, మీరు లోగడ ఓమారు నన్ను మళ్ళీ పెళ్ళి
చేసుకోమని ఎంతో పెద్ద మనస్సు తో అడిగి మీ సహృదయతను చాటుకున్నా రు. అప్పు డు నేను ‘ నా కు అలాంటి
ఆలోచన వేస్తే మీకే చెప్తాను’ అని అన్నా ను
కదా! ఆ ఆలోచన సమయం ఇప్పు డు వచ్చి ందత్తయ్యా !
నేను రఘురామ్ త్వరలో మీ సమక్షంలోనే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నా ం.బాబు
కూడా మా దగ్గరే పెరుగు తాడు. మీరు వాడ్ని చూసేందుకు ఎప్పు డైనా రావచ్చు .సెలవుల్లో కూడా వాడిని మీదగ్గర
ఉంచుకోవచ్చు . ఇకపోతే ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పా లత్తయ్యా ! మన కొత్త ఇంటిని నాపేరు మీదన్న
,లేక రఘు రామ్ గారి పేరునైన రిజిస్ట్రేషన్ చేయించండి. మా పెళ్ళి అయ్యా క
ఆ ఇంట్లోనే మేము కొత్త కాపురం మొదలు పెడ్తాం….”
అంటూ అదురు బెదురు లేకుండా ఏకధాటిగా కోడలు
మాట్లాడుతూంటే శ్రోతలు ముగ్గురూ అవాక్కయ్యా రు.
*** . *** . ***
“ఎక్కడికి గోపీ ప్రయాణం? ” చిన్నగా వున్న ఓ లెదర్
బ్యా గ్ లో బట్టలు సర్దుకుంటున్న కొడుకుని అడుగుతూ ఆశ్చర్యంగా చూడసాగింది మధుమతి.
” నేను నా ఫ్రెండ్ కల్సి ఊరెళ్ళు తున్నా ం. మళ్ళీ రేపీపాటికి
తిరిగి వచ్చేస్తాం అమ్మా !”
” ఇంట్లో ఇంత గందరగోళం జరుగుతుంటే నీవిప్పు డిలా
ఊరికెళ్ళా లా ఏమిటిరా ? నాకేం అర్థం కావడం లేదు…”
మధుమతి బేలగా చూడసాగింది.
” ఈ గందరగోళం సమసిపోవడానికే ఇప్పు డు నాయీ
అర్జెంట్ ప్రయాణమమ్మా ! నీవేం బాధ పడకు .
ఇల్లు తన పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయిస్తానని
వదినతో చెప్పు . మళ్ళీ రేపిపాటికి తిరిగి వస్తాను” అంటూ మరో మాటైనా ఆగకుండా వడి వడిగా వెళ్ళి పోతున్న
కొడుకు వంక మధుమతి అయోమయంగా చూడసాగింది.
*** . . ***. . ***
సాయంత్రం టైమ్ ఆరు కావస్తోంది.తాత మనవడు పార్క్
నుంచి తిరిగి వచ్చా రు. మధుమతి వంటింట్లో ఏదో పని
చేసుకుంటుంది.అంతట్లో ” అత్త య్యా ! ” అన్న కోడలి
పిలుపు వినిపించింది.
మధుమతి ఇవతలికి వచ్చి ంది. గౌతమి తో పాటు రఘు రామ్ కూడా వచ్చా డు. పలకరించకపోతే బాగుండదనుకొని ”
ఏం, బాబు ఎలా వున్నా రు?”అని
అడిగింది.
” బాగున్నా నండీ .అదే పెళ్ళి ఎప్పు డు పెట్టు కుందామని
అడగడానికిలా గౌతమి తో పాటు వచ్చా ను. సింపుల్ గా పెళ్ళి గుళ్ళో
చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుందండీ.”
” మీ వైపు పెద్దలు ఎవరూ లేరా అబ్బా య్? ” ఈ మారు ఆదినారాయణ అడిగాడు.
” లేకేం…మా అమ్మ ఆంధ్ర లో చిన్న పల్లె టూరిలో వుంటుంది . ముసలితనం
కళ్ళు సరిగ్గా కనబడవు. అందుకని పెళ్ళి చేసుకొని నేను
గౌతమి వెళ్ళి అమ్మ నిక్కడికి తీసుకుని వస్తాం. ఇక మా దగ్గరే వుంచుకుంటాం. ఇంటి రిజిస్ట్రేషన్ పని ఎంత వరకు
వచ్చి ంది…నా పేరు మీదనే చేయండి. గౌతమి కి కూడా
ఏం అభ్యంతరం లేదు. ఏమంటావ్? ” అంటూ ఆమె వైపు
క్రీగంట గా చూశాడతను..
” అబ్బే, నాకేం అభ్యంతరం లేదు ” చిన్నగా నవ్వి ందామె.
” సరే గౌతమీ, నీవు కోరినట్లు గానే రఘురామ్ మీదనే
కొత్త ఇల్లు రిజిస్ట్రేషన్ చేయిస్తానని… మొత్తం మీదగోపీ కృష్ణకు నేను నచ్చ చెప్పి ఒప్పించాను. ముందుగా వాడు
నీ పేరు మీదనే చేయాలనే ఆలోచన లో వుండిండే…గౌతమీ!”
చాలా కూల్ గా అంటున్న భర్త వైపు మధుమతి ఆశ్చర్యంతో అదే పనిగా చూడసాగింది.
అంతలోనే ఓ ఆటో సర్రున ముందుకు దూసు కొచ్చి వాకిట్లో ఆగింది.
అందులో నుంచి దిగుతున్న అపరిచితులను చూచి. ప్రేక్షకులు ముగ్గురూ అవాక్కయ్యా రు.ముఖ్యంగా రఘు రామ్
ముఖం ఆశ్చర్యంతో , కంగారుతో నోటమాట రావడం లేదు.
చివరగా దిగిన మరిది గోపీ కృష్ణ వంక చూస్తున్న గౌతమి
సంభ్రమాశ్చర్యా లకు లోనైంది.
తెల్లగా కొంచెం పొట్టిగా ముద్ద బంతి పువ్వు లా అందంగా ఉన్న
ఆమె ఎవరో అర్థం కాలేదు గౌతమికి. ఆమెతో పాటు ది గిన ఇద్దరు పిల్లలు .. వాళ్ళకు గోపీ కృష్ణ కు ఉన్న సంబంధం
ఏమిటో అసలు తెలియడం లేదు. అంతా
అయోమయంగా ఉంది.
వాళ్ళని చూడగానే రఘు రామ్ కు మాత్రం ముచ్చెమటలు పడుతున్నా యి.
కంగారుతో, భయాందోళనలతో తత్తర పడుతున్నా డు.
ఆ వచ్చి న పిల్లలిద్దరూ రఘురామ్ ని చూసి చూడ్డం తో నే
సంతోషంతో ఉప్పొ ంగిపోతూ ” నాన్నా !…” అంటూ ఆరు
స్తున్నట్లుగా పిలుస్తూ ఆనందంతో వచ్చి అతని చుట్టూ చేతులు వేసి ఉక్కిరిబిక్కిరి చేయసాగారు.
” ఎందుకండీ, మమ్ము లను ఇంత తొందరగా హైదరాబాద్
కు రమ్మని మీ ఫ్రెండ్స్ ఇద్దర్ని పంపారు…ఎందుకో అని
కంగారుగా అత్తయ్యని. పక్కింటి వాళ్ళకు అప్పు చెప్పి ఆదరా బాదరగా వచ్చేశాం. ఎందుకనీ.. అడిగితే. గోపీ కృష్ణ గారు
మాత్రం ఏం చెప్పకుండా ‘ సస్పెన్స్ ‘ అన్నా రంతే . అసలు
మీరు అమెరికా నుంచి ఎప్పు డొచ్చా రు ? కనీసం ఒక్క
ఫోనైన చేయలేదేమిటండీ ” భర్తతో నిష్టూరంగా గలగల
మాట్లాడుతున్న ఆవిడని , గౌతమి వింతగా చూడసాగింది కానీ, మధుమతి ఆదినారాయణ లకు మాత్రం విషయం
సంపూర్ణంగా అర్థం మైపోయింది. వచ్చి న అమ్మా యి వా ళ్ళు రఘు రామ్ భార్యా పిల్లలని తేట తెల్లమైంది.
‘వదిన పెళ్ళి ఆనీచుడితో కాకుండా ఆపి, గోపీకృష్ణ మంచి పని చేశాడు’ అనుకుంటున్నా రా దంపతులు లోలోన.
” వీళ్ళి ద్దరూ మా అమ్మ నాన్నలు . ఈమె మా వదిన గౌతమి. ప్రస్తుతం మీయీ భర్త అయిన ఈ రఘు రామ్
మా వదిన్ని రెండో పెళ్ళి చేసుకోవడానికి రెడీగా ఉన్నా డక్కయ్యా ! భార్యా పిల్లలను , కన్నతల్లి ని గాలికి
వదిలేసి, అమెరికా నుంచి తిరిగి వచ్చి న విషయాన్ని రహస్యంగా ఉంచి… కనీసం. మీ కెవ్వరికి. కూడా
తెల్పకుండా.. తాను మాత్రం
పూలరంగడిలా తిరుగుతూ మావదినగారితో రెండో పెళ్ళి కి రెడీ అవుతున్నా డు…ఈ మోసకారికి ఏం శిక్ష విధి స్తారో
మీఇష్టం…” కోపావేశాలతో గోపీ కృష్ణ అంటున్న మాటలకు తన తల ఎక్కడ పెట్టు కోవాలో రఘు రామ్ కు అర్థం కావడం
లేదు.
విషయమంతా అర్థం కావడం వలన గౌతమి తానెంత
మోసానికి గురి అయ్యేదో క్షణంలో గ్రహించుకుంది.
” ఛీ ఛీ! నిజంగా మీరెంత నీచులండీ . అత్తయ్య, నేను , పిల్లలు చచ్చి పోయామనుకున్నా రా? మీ కింకా పెళ్ళే కాలేదని
చెప్పి గౌతమి గారిని నమ్మి ంచారా ? మొత్తం మీద మీరు మహా ఘనులండీ. ఎంతో కష్టపడి వాళ్ళు
కట్టుకున్న కొత్త ఇంటిని మీ పేరు మీద రాయించుకొని
తర్వా త దాన్ని అమ్మేసి…గౌతమి గారిని తన్ని తగలేదా మను కున్నా రా? ఏం మనుష్యు లండి మీరు? ఎంతో గొప్ప
ఆలోచన చేశారు…మీ బూటకపు నటనకు పాపం
అమాయకురాలు అయిన గౌతమి మీ వలలో పడి
పోయింది…”అంటూ భర్త ను నోటి కొచ్చి నట్లుగా మాట్లాడుతూ ఉన్న ఆమె ధైర్యా న్ని గౌతమి అబ్బు రంగా
చూడసాగింది.
ఇక అక్కడ ఓ క్షణం కూడా కూర్చో లేక పోయాడు
రఘు రామ్.కంద గడ్డలా మారి పోయిన ముఖం తో
విస విస వాడుతూ వెళ్ళు తున్న అతని చేయి పట్టుకొని
” ఆగండీ , నేను పిల్లలు కూడా మీతో పాటే వస్తాం…”
అంటూ అందరికీ చెప్పి భర్త వెనకాలే పిల్లల్ని తీసుకుని
బయలు దేరుతున్న ఆమె కు ” అక్క , జాగ్రత్తగా ఉండండి.ఇతని మీద పక్క పోలీసు స్టేషన్లో కంప్లయింట్
కూడా రాసి ఇచ్చా ను” వెనుకాల నుంచి అంటున్న గోపీ కృష్ణ మాటలకు ” ఫర్వా లేదు లేదు తమ్ము డూ, నేను
చూసుకుంటాను…ధన్యవాదాలు” అంటూ ముందు కు
కదిలిందామె.
పెద్దగా వాన వచ్చి . వెలిసినట్లుగా ఒక్క సారిగా ఇల్లంతా
నిశ్శబ్దంగా అయ్యి ంది.
ముందుగా నోరు విప్పింది మధుమతి.” అమ్మో ! అమ్మో !
ఎంత మోసం ? నీ పుణ్యమా అని అతని బారిన పడకుండా మన అమ్మా య్ గౌతమి తప్పించు కోవడం
అదృష్టం గోపీ!”
” అవునవును.నీవన్నది అక్షరాలా నిజం ” భార్య మాటలకు
ఆది నారాయణ కూడా వంత పాడాడు.
” ముందుగా నన్ను మీరంతా క్షమించండి అత్త య్యా !
ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు ” పశ్చా త్తాపంతో దుఃఖ స్వరంతో అంటున్న కోడల్ని ఆప్యా యంగా దగ్గరకు
తీసుకొని మధుమతి ఓదార్చింది.
” ఇందులో నీ తప్పు ఏం లేదు లే గౌతమీ! ఈ కాలంలో గుడ్డిగా ఎవ్వరినీ పూర్తిగా నమ్మడానికి వీల్లేదు.”
” అవును వదినా ! అమ్మ చెప్పింది నిజం.. మీరు మళ్ళీ
పెళ్ళి చేసుకోవడానికి అమ్మా నాన్న లతో పాటు నేను కూడా వ్యతిరేకిని కాను వదినా!
అన్నయ్య ఎలాగో మీకు అన్యా యం
చేసి వెళ్ళి పోయాడు. మళ్ళీ మీకు అన్యా యం జరక్కు ండా చూసుకున్నా ను. మా ఫ్రెండ్ అన్నయ్య
ఒకతను అమెరికా లో ఉన్నా డు. అతని మిసెస్
పోయిన ఏడాది కారు యాక్సీడెంట్ లో చనిపోయింది.అతను మళ్ళీ పెళ్ళి చేసుకునేందుకు
వాళ్ళు అమ్మ నాన్నలు ఒప్పించారట…విషయమే
నేను వాడి తో మాట్లాడుతున్న సమయంలో నే ఈ
దుర్ఘటన జరిగింది” అని మాట్లాడుతున్న మరిది తో
పాటు దేవతలాందటి అత్త మామగార్లను సజల నయనాలతో చూడసాగింది గౌతమి.
అయిపోయింది
***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దీపావళి

కాంత-కనకం