మన మహిళామణులు

శ్రీ మతి వెంకట రత్నం గారు

ఆమె సోషల్ వర్కర్! వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు.ఆమెయేశ్రీమతి అవసరాల వెంకటరత్నం గారు.ఆంధ్రాబ్యాంక్ ఆఫీసర్ మేనేజర్ గా 30ఏళ్ళు పనిచేసి రిటైరైన ఆమె ఇప్పటికీ ఆశ్రమ బాధ్యతలు ఇతరులతో కలసిపంచుకుంటున్నారు
ఈమె విశాఖపట్నం లో పుట్టారు.అమ్మానాన్నలు శ్రీ మతి మల్లాప్రగడ పద్మావతి శ్రీ అప్పారావు గార్లు.ఇద్దరూ స్వాతంత్ర్య సమర పోరాటం లో తమకాలాన్ని ధనాన్ని వెచ్చించారు.తండ్రి జీవితాంతం ఖాదీ వస్త్రాలను ధరించారు.తల్లి ఆనాడు శోషల్వర్కర్ గా అన్నింటి లో చురుగ్గా పాల్గొన్నారు.ఆమె విశాఖ మహిళా మండలి లైఫ్ ఎక్జిక్యూటివ్ మెంబర్ గా వనితలు చదువు బాగోగులకై కృషి చేశారు అలా తల్లి ప్రేరణతో రత్నం గారు కూడా ఉడతాభక్తిగా తనవంతు సేవ లను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.పెళ్ళి ఐనాక హైదరాబాద్ లో స్థిరపడ్డారు.ఆంధ్రాబ్యాంకు మేనేజర్ గా పని చేస్తూ శ్రీ మతి అన్నింటి శేషలక్ష్మి గారి తో కలిసి సంఘసేవికగా పాలు పంచుకున్నారు.అభ్యుదయమహిళా మండలి లోచేరి రేడియో ప్రోగ్రాం లో పాల్గొన్నారు.మహిళా సమస్యలపై దృష్టి సారించారు.రిటైరైనాక కీ.శేశ్రీమతి పుతలీ బాయి శ్రీ మతి వై.లలితామూర్తి తో కల్సి సంఘమిత్ర అనే పేరుతో ఓ వృద్ధాశ్రమం ని నెలకొల్పారు.విరాళాలుసేకరించారు భావన నిర్మాణం కోసం! కీ.శే.శ్రీ జె.ఎల్.ఎన్.శర్మ కంచి కామకోటి పీఠం ఆంధ్రప్రదేశ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ గారి అండదండలతో ఆశ్రమ నిర్మాణం జరిగింది.
కంచి కామకోటి పీఠం మహాస్వామి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి గారు వచ్చి దాన్ని ప్రారంభించారు.ఆయన ఆశీస్సులు అందజేశారు.అది ఓదివ్య అనుభవం అదృష్టం కూడా! ఇప్పటికీ రత్నం గారు తన శక్తిమేరకు ఆహోం కి వెళ్ళి వస్తూ దాని బాగోగులు చూసుకుంటున్నారు.ఆమెకు ఇంకా శక్తి సామర్థ్యాలు ఆరోగ్యం ప్రసాదించాలని ఎందరికో ఆమె స్ఫూర్తి దాత గా వెలుగులు పంచాలని తరుణి మనసారా కోరుకుంటోంది.

ఈమె ఫోన్ నెంబర్ 9293924905

3 Comments

Leave a Reply
  1. చాలా బాగా రాశారండి పరిచయం. ఆమె ప్రముఖ నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ శిష్యురాలు. ఆ శిష్యరికంలో ఆమెకు తరువాతి కాలంలో నాట్యాచార్యులుగా ప్రసిద్ధి చెందిన శ్రీమతి ఉమా రామారావుగారు, శ్రీమతి సుమతీ కౌశల్ గారు సహాధ్యాయులు.

    మా బంధువర్గంలో ‘రత్నం అక్కయ్య’ గా ఆవిడ తెలుసు. ఆమె సాంఘిక చైతన్యము, సంఘసేవ మనందరికీ ఎంతో ఆదర్శప్రాయము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బెస్ట్ టీచర్ అవార్డ్

బాల తరుణి