రాతి బొమ్మ

గతి తప్పిన సప్తపదితో

బంధం భారంగా మారగా

కర్కశ పాదాల కిందపడి

నలిగిన స్త్రీ సౌకుమార్యం

పొరబడి తొంగి చూసిన వసంతానికి

ఆనవాలుగా నీ గర్భాంకురాలు

వేదన వ్యక్తిగా మారి రోదనై

సమస్యల సుడి గుండం (లో)మై

విసిగి వేసారిన బ్రతుకులో

పరాయిపాలైన పేగు బంధంతో

అపహాస్యమైన అమ్మతనం

గమనం ప్రశ్నార్థకం కాగా

తడి ఆరని నీ నయనాలు

ధారలై ఏరులై నదులై

కడలిగా రూపాంతరం చెందగా

నీ కన్నీటి ప్రవాహంలో ఈదులాడి

సేదదీరిన జీవాలెన్నో!

బ్రతుకు కొలిమిలో కాలిమసైన

నీ మది వాడి మోడై బీడై

యమ యాతనలతో నిస్తేజమై

మౌనం దాల్చి రాతిబొమ్మగా మారిన నిన్ను

Written by Shyama Radhika

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఏమండి కథలు

పాదరక్షలు