తరుణి చిత్ర కవిత

రంగులు హృదయ ఆవిష్కరణ హంగులు
మనోవేదికపై మంచితనం సుగంధాలు
ఆత్మబోధనకు వెలుగులు
మోదమో ఖేదమో హేతువులు
భావవిష్కరణకు రకరకాల దారులు
పెదవి నవ్వులు నొసటి వెక్కిరింతలు
కంటి కదలికలు కరచాలనల భేదాలు
గుండె గుండెకొక వింత స్పందనలు
పువ్వులు మనుషులు సరిలేని గరిమల బోధనలు
పువ్వులు మనసుల ప్రతిబింబాలు
మానవత్వం ఒక్కటి మనదైతే
సుగంధ పరిమళాలే మన చుట్టూ!
మనమంటే?
మనమంటే పువ్వులం
మనమంటే పరిమళాలం!!
            _ డా. కొండపల్లి నీహారిణి

 

 

చిత్రకారిణి : గీతాచార్మి నూనెపల్లి, యుజి విద్యార్థి

తల్లి పేరు : డా. అయోధ్య కవిత, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటి

తండ్రిపేరు : గిరిధర్ నూనెపల్లి, జెనెరల్ మ్యానేజర్, మోహన్ స్పిన్ టెక్స్

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన రామయ్య పెళ్లిరే (మన రామయ్య పెళ్ళి ముచ్చట్లు)

సాధికారత అంటే?