ఎన్ని రకాల దోపిడీలో
జగత్తులో
అమ్మయ్య!
మనస్సు నా దగ్గరే ఉంది.
సముద్రాన్ని
పీల్చేయాలని మేఘం
మేఘ జలాన్ని
లాక్కోవాలని సముద్రం!
పిచ్చాసుపత్రి
వెయ్యిరెట్లు మెరుగు
యుద్ధోన్మాదులు
మతోన్మాదులకంటె
వానకురిస్తే
భూమి స్పందించింది
తియ్యటి వాసనతో
పెదవి నందించింది
మనస్సు
పానశాలగా మారితే
లోకం
తూలి తూలి పడుతుంది