ఆకాశవాణిలో ప్రఖ్యాత కళాకారులు అయిన శ్రీ వి.బి.ఆనంద్ గారు మా అక్కలు కుమారి.వింజమూరి లక్ష్మీ మరియు సరస్వతి ల గురించి రాసిన కొన్ని వాక్యాలు…
✍️✍️✍️✍️
నా ఆకాశవాణి నాటక ప్రస్థానంలో మొదటి నాటకం అన్నపూర్ణ లో వింజమూరి లక్ష్మి గారు అన్నపూర్ణగా నేను శ్రీకృష్ణదేవరాయగా నటించాం ఆ తరువాత అనేక నాటకాలలో ఆమె కథానాయికగా నటించింది నాతో నటించింది. కొంత సమయం జరిగిన తరువాత వింజమూరి సరస్వతి గారి నాకు జోడిగా వచ్చింది ఉన్నవ లక్ష్మీనారాయణ గారి నవల మాలపల్లి ని తెలుగులో అనువదించి సంఘ విజయం పేరుతో నేను, కె.వెంకటేశ్వరరావు, జి యస్ ఆర్ మూర్తి, చిరంజీవి రావు కోటేశ్వరి, సత్యనారాయణ రాజు, సండూరి వెంకటేశ్వర్లు, సి.రామ్ మోహన్ రావు, ఎం ఝాన్సీ, ఎం సుశీల, సిహెచ్ వరలక్ష్మి తో పాటు వింజమూరి సరస్వతి కూడా నటించింది. తరువాత ఈ దేశం ఏం కావాలి నాటకంలో సీతారత్నమ్మ గారు నేను, వి.బి కనక దుర్గ, పాండురంగ, నండూరి సుబ్బారావు, సి రామ్ మోహన్ రావు కొండయ్యలతోపాటు సరస్వతి గారు కూడా నటించారు.
మనసులోని మహానాలం జాతీయ నాటకంలో బందా కనక లింగేశ్వర రావు,
నేను వి ఎస్ నారాయణ మూర్తి, రామచంద్ర కాశ్యప, నండూరి సుబ్బారావు, వి.బి కనకదుర్గ ప్రయాగ వేదవతి లతో పాటు వింజమూరి సరస్వతి గారు కూడా నటించారు. రేడియో నాటక సప్తాహం కార్యక్రమాల్లో భాగంగా జీవనస్రవంతి సంగీత రూపకంలో కందుకూరు చిరంజీవి రావు, నేను,సి రామ్ మోహన్ రావు, రామచంద్ర కాశ్యప, నండూరి సుబ్బారావు బాల కోటేశ్వరిలతోపాటు వింజమూరిసరస్వతి గారు పాల్గొన్నారు. వేణుగోపాల రావు గారు రచించిన సూరీడు దిగిపోయాడు నాటకంలో సుత్తి వీరభద్ర, నేను పాత్రో అమరాలతతో వింజమూరి సరస్వతి గారు. పోలాప్రగడ వారు రాసిన కౌసల్య జాతీయ నాటకంలో నేను నండూరి సుబ్బారావు విబి కనకదుర్గ మున్నగు వారితో సరస్వతి గారు నటించారు. పంజరంలో పక్షులు నాటకంలో నేను, కమల కుమారి, పాండురంగ, సి. రామ్ మోహన్ రావు మున్నగు వారితో సరస్వతి గారు నటించారు. నాటి కలలు రేపటి నిజాలు సీరియల్ నాటకం లో నేనూ ఆలపాటి లక్ష్మీ శ్రీ గోపాల్ పాండురంగ భద్ర వ్రత కోకా సంజీవరావు సుశీల మున్నగు వారితో సరస్వతి గారు నటించాం. సరస్వతి గారు నాతో పాటు దాదాపు 50 నాటకాల వరకు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సున్నితమైన గొంతు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని దానిలో జీవించి చెప్పగలిగిన సత్తా ఆమెలో ఆప్యాయత,అణకువ కనిపిస్తోంది. ఎవరితోనూ అతిగా ఉండదు కానీ అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం. ఆమెతో నటించడం చాలా ఆనందంగా ఉంటుంది.