నృత్య కళాకారిణి ఎన్.ఎస్.ఎల్ ప్రవీణ

ఆమె కేవలం డాన్స్ లోఅందులో కూచిపూడి నృత్య కళాకారిణి మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి! డాక్టర్ వేదాంతంరామలింగశాస్త్రి గారి దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు.పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ నుంచి కూచిపూడి ఎంఏ.లోగోల్డ్ మెడల్ పొందారు.యక్షగానం డిప్లొమా లో డిస్టింక్షన్ కర్ణాటక సంగీతం సర్టిఫికెట్ కోర్సు లో డిస్టింక్షన్ సాధిం చారు.తెలుగు సినీరంగంలో కొరియోగ్రాఫర్ గా ప్రతిభ చాటుతున్నారు.తెలుగు ఫిల్మ్ టి.వి.డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్TFTDDAలో మెంబర్.కలర్స్ ఆఫ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ కి2011డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.కూకట్పల్లిరుషి యు.బి.ఆర్.ఉమెన్స్ కాలేజీ లో బిజినెస్ మానేజ్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్! తన కలర్స్ ఆఫ్ డాన్స్ సంస్థ లో కూచిపూడి నృత్యం లో100మందిపైగా పిల్లల కి శిక్షణ ఇస్తున్నారు.సర్టిఫికెట్ కోర్సు లో 5గురు అమ్మాయి లు ఫస్ట్ డివిజన్ పొందారు.కూచిపూడి డాన్స్ డిప్లొమా లో ఒక అమ్మాయి ఫస్ట్ డివిజన్ సాధిం చింది.దేవనార్ అందుబాటులోకి జానపదక్లాసికల్ డాన్స్ లో శిక్షణ ఇచ్చారు వారి సంస్థ వార్షికోత్సవం కోసం! తలసేమియా బాధితులకు రెండు జానపద నృత్యాలు నేర్పించారు మెహదీపట్నం ప్రభుత్వ పాఠశాలలో పిల్లల కి నేర్పారు.2006లోసెయింట్ థెరిసా రాధాకృష్ణ హోం ఆల్ క్రైస్ట్ అనాధాశ్రమ బావిలోకి శిక్షణ ఇచ్చారు.ఫిల్మ్ నిర్మాత స్వప్న దత్ షాలిని రాఖీల సమక్షంలో పిల్లలు ప్రదర్శించి వారి మెప్పు పొందారు.


రాష్ట్ర స్థాయిలో ఎన్.ఎస్.ఎస్.వాలంటీర్లకి యూత్ ఫెస్టివల్ కోసం శిక్షణ ఇచ్చారు.సూడాన్ సిరియా యు.ఎ.ఇ.మొదలైన 12వివిధదేశాల విద్యార్థులకు(ఉస్మానియా యూనివర్సిటీ) తెలంగాణా జానపద నృత్యాలు నేర్పించారు.శాన్ఫ్రాన్సిస్కోలో మహాబృందనాట్యం 2008లో జరిగింది.మొత్తం 332మంది కళాకారులు చేసిన దానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో ఈమె చోటు సంపాదించారు.Art 4peaceఇంటర్నేషనల్ అవార్డు బెర్క్లి హిల్స్ లో పొందారు.8మార్చి 2002లోసర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ యు.ఎస్. నాట్య బాల బిరుదు మనగవర్నర్ తమిళ సై సౌందరరాజన్ నుంచి అవార్డు స్వీకరించారు రు.ఎస్.దుబై ఇంకా దేశవి2000పైగా ప్రదర్శన లిచ్చారు.BIGBoss4లో దసరాస్పెషల్ ఎపిసోడ్ స్టార్ మా..లో లోగో లాంచ్ ఓఅనుభవం!సినీనటి జయప్రద కిLove@65movie కి కొరియోగ్రఫీ చేశారు.డైరక్టర్ క్రిష్ .. హరిహర వీరమల్లు ; బాహుబలి 2లో కొన్ని నిదురించే రా కి అసిస్టెంట్ గా అనుభవం సంపాదించారు.మహానటి లో అహనా పెళ్లంట_లో కీర్తి సురేష్ తో పరిచయం సినిమా రంగంలో కాలు మోపటం ఆమె కెరీర్ కి మలుపు. కూచిపూడి డాన్స్ బాలే శ్రీ షిర్డీ సాయిబాబా
నర్తనశాల బాలే మంచి పేరు తెచ్చాయి.బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ దగ్గర శిక్షణ పొందారు.మహాన్యూస్ లైవ్ టాక్సీలో పాల్గొన్నారు. గోలగోల సినిమాలో సోలో”నా లోనే లేను గా”ప్లేబాక్ సింగర్ గా కొత్త అనుభవం!వెంపటి చినసత్యం కె.విశ్వనాధ్ వేటూరి మంజుభార్గవి శేఖర్ కమ్ముల అశ్విని దత్ మొదలైన హేమాహేమీల ప్రశంసలు పొందిన ప్రవీణ ఇంకా ఉన్నత శిఖరాలను అందుకోవాలి అని తరుణి శుభాకాంక్షలు తెలుపుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఏది శాశ్వతం

చుక్కాయపల్లి శ్రీదేవి అవధానం