ఏ తక్కెడ తూచగలదో
కన్నీటి బరువును
ఏ దూరం రాయబారమంపగలదో
మరలిరాని నేస్తానికి..
ఏ తీరం అడ్డుపడగలదో
అనంత దుఃఖ సాగరానికి
ఏ వెలుగు దారి చూపుతుందో
అడుగిడు పయనానికి
ఏ గమ్యాన్ని చేరినా
శాశ్వత స్థానానికి
స్వాగతం పలికేది
స్మశాన వాకిలే..
ఎడతెగని వేదన
మనసుతరువుకి ఎరువుగా మారితే
కనుల కొమ్మ రాల్చు
నీటి విత్తనాలు
మన్ను స్పర్శ సోకి మొలకలేస్తాయేమో
పువ్వులై విరిసి ఆ మట్టిలోనే కడతేరిపోయేందుకు
ఏదీ శాశ్వతం కాదిక్కడ
ప్రాణమైనా,బంధమైనా..
పువ్వు నవ్వైనా,మనిషి బ్రతుకైనా..
స్వాతికృష్ణ సన్నిధి