నాలుగు కలలను వెంటేసుకుని
నలుగురితో కలిసి నడిచే కణాలను జంట చేసుకుని
నీవో బ్రతుకువవుతావు
నేనూ ఓ బ్రతుకు నవుతాను
కారణాల రణాల గాయాలకు
కొన్ని నమ్మకాలు లేపనాలవుతాయి
దిగులు అడుగులకు అధైర్య వచనాలు వేలాడేసిన ప్రతిసారి
అనిర్వచనీయ శక్తి వెన్నుతట్టి
ధైర్యమెదురవుతుంది
దారుల వెలుగుల పయనమవుతుంది
పండుగలు ఆనంద నిలయాలు
పండుగలు అపురూప భావాలు
శుభ్రజ్యోత్స్నల పలుకు రాగాలు
భధ్ర నిర్ణద్రల తళుకుల మర్మాలు
– డా।। కొండపల్లి నీహారిణి