బతకనిచ్చి న బతుకమ్మ

     డా. ఆరుట్ల శ్రీదేవి

ప్రకృతిలో పూచిన ప్రతీ పువ్వూ పూజనీయమైనదే అని తెలిపేదే బతుకమ్మ.
భారతీయుల ఆచారాలు నమ్మకాల్లో ఒక్కో దేవతకు ఒక్కో పువ్విష్టం అని అంటుంటారు.

శివునికి అత్యంత సువాసనా భరితమైన మొగలి పువ్వు మల్లెపూలు లాంటివి పెట్ట కూడదని నియమం సాధారణంగా సువాసన కొంత కామప్రేరణ కలిగిస్తుందని కొందరి భావన. శివుడు జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు. జ్ఞానము కామము ఒక్క దగ్గర ఇమిడేవి కాదు. జ్ఞానమే లక్ష్యంగా ఉండే వాళ్లకు కామం ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి ఆ పువ్వుల కు దగ్గరగా ఉండక పోవడం మంచిదనే భావన అంతే.ఇదేవిధంగా పాములకు సువాసనా భరిత మైన వాతా వరణం ఇష్టం. అందుకని నాగ దేవతకు సువాసన పువ్వులే పెట్టి, పూజించి , నీ ఇష్టాన్ని గౌరవిస్తామని మన భక్తిని చాటు కుంటాం.

గౌరీ దేవి స్త్రీల గౌరవం చాటే దేవత. ఈ దేవతకు ప్రతీక అయిన బతుకమ్మకు మాత్రం పనికిరాని పువ్వు అనేది ఏదీ లేదు. తెలంగాణా ప్రాంతం లో ఎక్కడ పడితే అక్కడ పెరిగే ఒక రక మైన జాతి చెట్లకు భేషరం చెట్లు అంటారు. సాధారణంగా జనులు ఈ చెట్లకు చాలా దూరంగా ఉంటారు. కానీ బతుకమ్మ పేరికలో మాత్రం వీటిని సైతం వదిలి పెట్టకుండా పేరుస్తారు. దీని వెనుక చాలా సూక్ష్మ మైన రహస్యముంది.
అసలు ఈ బతుకమ్మ పండుగ అనేది ఒక విప్లవాత్మక ఉద్యమం అయ్యుంటుంది . తిలక్ గారు సామూహిక వినాయక భక్తి సంఘాలు స్థాపించినట్టు . పురాణాల్లో గాని , ఇతిహాసాల్లో గానీ ఈ బతుకమ్మ గురించిన వివరణ ఎక్కువగా కనిపించదు. ఈ బతుకమ్మ ఓ నాలుగైదు వందల సంవత్సరాల కిందటిదే అని అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే బతుకమ్మ పాటల్లో చాలా మటుకు స్త్రీల కు సంభందించిన సమస్యలు ,బల హీనవర్గాలు బలవంతుల చేతుల్లో పడే ఒత్తిడులు, మూఢ విశ్వాసాలతో ఆడవాళ్ళ పట్ల జరిగే అన్యాయాలు కనిపిస్తుంటాయి.

సాధారణంగా స్త్రీలు శీలవంతులై ఉండాలని, పాతి వ్రత్యం పాటించాలని మన ప్రాచీన గ్రంధాలు నొక్కి చెప్తున్నాయి.స్త్రీ ఒక్క పురుషునికే భార్య అయి ఉండాలనేది సనాతన ధర్మ సంస్కారం. స్త్రీ కి విచ్చ ల విడి శృంగారం అనారోగ్య కారణమని దీని ఉద్దేశం. ఈ నిబంధనలు పాటించ కుండా హద్దులు దాటే వారిని అపవిత్రంగా భావించి సమాజం నుండి వెలి వేసే వారు. కానీ.

కొంతమంది అమాయక స్త్రీలు బలవంతం చేయబడితే కూడా ఆమె తప్పు లేనప్పటికీ అపవిత్రమైనదే అని భావించి ఆమెను ఎవరూ వివాహం చేసుకోక పోవడం, లేదా ఎవరిచే బలవంతం చేయబడిందో వారినే పెళ్లి చేసుకోవాలనే నిబంధన పెట్టి
ఇష్టం లేకపోయినా బలవంతపు సంసారం చేయించడం జరిగేది. ఒక వేళ అటువంటి అవకాశం లేకుంటే
ఆమె చంపోవడమే సబబై నదని న్యాయం చెప్పేవారు.స్త్రీల పట్ల జరిగే సామాజిక అన్యాయం ఇదొక వైపయితే , చిలుమూలా పేరుకు పోయిన అనాచారం డేవాదాసీల వ్యవస్థ. నిజానికి ; దేవడాసి; అనే పదానికి మూలార్ధం వేరే. వారు వారి కళను దైవానికి సమర్పించడం. దాన్ని కొందరు స్వార్థ పరులు వారి వారి వ్యక్తిగత శారీరక సుఖాలకు వాడుకొని వదిలేసి వారిని సమాజం లోకి రానివ్వక పోవడం ఒక అన్యాయం మరొక సామాజిక రుగ్మత వేశ్యావృత్తి
వ్యభిచారం .
వ్యభిచారం అనేది నేరం, పాపం కూడాను . వీళ్ళు ఎవరైనా సంఘ సంస్కర్తల బోధన వల్ల తమ నడవడిలో
మార్పు తెచ్చుకొని మంచి జీవితం జీవిస్తామనే నిర్ణయం తీసుకున్నా, వారినిక సమాజం లో కలువనివ్వ క పోవడం కొంత విచారకరమైనదే.
అప్పుడు వాళ్లేమను కుంటారంటే మేము మంచిగా ఉన్నా మమ్మల్ని అపవిత్రులు గానే చూస్తారు. కాబట్టి మారడం వలన వచ్చిన లాభమేమీ లేదని మళ్లీ తిరిగి
పాత జీవితం లోకే అడుగు పెడతారు .

సరిగ్గా ఇటువంటి సామాజిక పరిస్థితుల్లోనే ఎవరో ఒక అబల హృదయ విదారక ఆవేదనే , బతుకమ్మకు అన్ని పూలు పనికొస్తాయనే నియమం రూపు దాల్చి ఉంటుందనేది
బలపడుతుంది.

అడవిలో ఉండీ అందని చిటారు కొమ్మకు పూచేటి తంగేడు అయినా, వాసన లేని గునుగు పువ్వు అయినా , ముట్టుకుంటే విషం అనుకునే భేషరం చెట్ల పువ్వులు అయినా, ఏ పువ్వైనా అన్నీ బతుకమ్మలో చేరడానికి అర్హమైనవే . చెట్టుమీదున్నంత వరకు అది పువ్వు. బతుకమ్మలో చేరిన తరువాత అది గౌరీ దేవి.

స్త్రీ అంటేనే పవిత్రమైనది. శీలం అనే పదాన్ని చాలామంది వేరే అర్థం లో వాడుతారు. శీలమంటే మంచి వ్యక్తిత్వం.
ప్రతి స్త్రీ ని పురుషుడు పవిత్ర దృష్టి తోనే చూడాలి.
అప్పుడు కాస్త చెడు భావాలు కలిగిన స్త్రీలో కూడా ఒక విధమైన పాశ్చాత్తాపం కలుగుతాయి. అందుకే బతుకమ్మ కోసం పువ్వుల సేకరణ అన్నదమ్ములదే. ఆ పువ్వు తెంపేటప్పుడైనా అతడి హృదయం లో ఎదో ఒక మూలన గౌరవం పెరుగుతుంది. స్త్రీలను గౌరవించండి అని ప్రత్యేకంగా గోడలపైనా బస్సుల పైన రాసే దుర్గతి నుండి బయట పడుదాం. ఈ బాధ్యతను నిర్వర్తిస్తూ బతుకమ్మను కాపాడు కుందాం . అందరమూ కలిసి ప్రతి ఏడూ ఆడుకుందాం.

డా ఆరుట్ల శ్రీదేవి

నిజామాబాద్

Written by Arutla Sridevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకృతి దృశ్యం – నయనా నందం

బతుకమ్మ వేడుక