సూక్ష్మ కావ్యం

  వనపర్తి పద్మావతి హన్మకొండ,

అపురూపాలు
(బుర్రా వెంకటేశం గారి సాహిత్య ప్రక్రియ కోసం)

కోడికూతే మేలుకొలుపులా
తొలిపొద్దు కిరణాలే ఓదార్పుగా

నిరంతర గంగా ప్రవాహంలా
ఆవిశ్రాంత ప్రకృతి రూపం మనకు వరం అమ్మ

పచ్చిమట్టి పరిమళంలా ఎదతడినిదాస్తూ
తట్టి లేపే పలకరింత

తుళ్ళిపాడే పలవరింతతో కళ్యాణ రాగాంతో
ఆప్యాయత పరిమళం నింపుతుంది

ఉదయబానునితో పోటి పడ్తున్నపుడు
ఆశ్రమైక్య సౌందర్యం వర్ణించ ఆ దేవునికే తరమా!

అమ్మ శ్రమ చెమట ధారలే ఎరులై ప్రవాహలై
దేశంలోని నదులైనాయి అన్ని నదులకు అమ్మపేర్లే

నిరంతర తపస్విలా తామసిలోను వెలుగులు పంచె
తరతమ భేదం లేని అన్నపూర్ణమ్మ

అమ్మ రూపం ఇస్తే నాన్న హృదయానికి స్పందన
ఆకాశమంత అండగా ఉంటూ లోకాన్ని పరిచయం చేస్తాడు నాన్న

నీ ఎదుగుదలకు తాను నిచ్చెనవుతు,
ఆత్మవిశ్వాసాన్ని పంచె కనపడని శ్రామికుడు

ఈ ప్రపంచంలో అపురూపమైన వరాలు
ఇలో కన్నించే దైవాలు కన్నవాళ్ళు

సెల్ : 9949290567.

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విముక్తి చేద్దాం రండి

దేవీ నవరత్నమాలికా స్తోత్రం