మన మహిళామణులు

శ్రీ మతి ఆచంట హేమ లతాదేవి

నేటితరం మహిళలు ఇంతగా రాణిస్తూ ఉన్నారంటే దాని వెనక నిశబ్దంగా ఉండి సంసారం లో మునిగి తేలుతూ అత్తింటి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేవారు వారి అమ్మ లు! కానీ తామూ పిల్లల తో చదువు తూ సోషల్ వర్కర్ గా ఉన్న మహిళ తన కుమార్తె కి రోల్ మోడల్ గా ఉన్న డాక్టర్ ఆచంట హేమ లతగారిని గూర్చి తరుణి పత్రిక పాఠకులకు తెలపాలని నాఉద్దేశం.మమతల మాలిక_తరుణి స్వచ్ఛంద సంస్థ !


శ్రీ మతి మమతా రఘువీర్ 1999 లోనే తరుణి అనే స్వచ్ఛంద సంస్థ ను నెల కొల్పి రిజిస్టర్ చేయించారు.బాల్యం లో అమ్మ నాన్నల సేవాభావం ఈమె హృదిలో నాటుకుపోయింది. ఆమె ఎదిగినట్టే ఆమె ఆదర్శ భావాలూ ఎదిహాయి . ఇందుకు తల్లిదండ్రుల వారసత్వం, భర్త శ్రీ రఘువీర్ గారి ప్రోత్సాహంతో శాఖోపశాఖలుగా విస్తరించింది.తరుణి సంస్థ నిగూర్చి రాయాలి అంటే రోజు కో కాలమ్ వచ్చేలా రాయవచ్చు.ఆమె తల్లి తండ్రుల ప్రోత్సాహం బాల్యం నుంచి లభించటం ఆమె అదృష్టం.తల్లి ఆమెకు రోల్ మోడల్. ఆవిడ ను గురించి ఈ రోజు తెలుసుకుందాం. తరువాత కూతురి ని గురించి తెలుసుకుందాం.

ఆచంట హేమలతాదేవిగారు తన పెళ్లి టైం కి బి.ఇడి.పాసైనారు.శ్రీసద్గురు ప్రసాద్ గారి తో వివాహం కుటుంబ బాధ్యతలు చేపట్టారు.ఇంకో విశేషం ఏమంటే హేమ గారు స్కూల్ కి వెళ్లకుండా ప్రైవేటు గా పరీక్ష లు రాసి పాసైనారు. టెక్కలి ప్రైమరీ స్కూల్ టీచర్ గా పనిచేశారు.ఆమెకి కొడుకు ఓకూతురు. భర్త ఉద్యోగరీత్యా టెక్కలి లో ఉన్నప్పుడు ప్రైమరీ స్కూలు టీచర్ గా పనిచేశారు.చిన్నారి మమతను తనతో తీసుకువెళ్ళేవారు.ఉత్కళ్ యూనివర్సిటీ ఎం.ఏచేశారుఎం.ఫిల్. పి.హెచ్.డి కి ఉస్మానియా యూనివర్సిటీ కి వెళ్ళారు.ఇంట్లో 12ఏళ్ళపాటు వృద్ధ అత్తగారి ని ఆడపడుచు పిల్లలని కూడా చూసుకున్నారు . భర్త జిల్లా జడ్జి గా ట్రాన్స్ఫర్ ఐతే 1976లో పిల్లల కోసం హైదరాబాద్లో స్థిరపడ్డారు ఆమె! ఆనంద్ నగర్ కాలనీలో (ఖైరతాబాద్) ప్రకాష్ విద్యా నికేతన్ హెచ్.ఎం.గా పని చేశారు.బాబూ జగజీవన్ కాలేజీ లెక్చరర్ గా పని చేస్తూ సోషల్ వర్క్ చేసేవారు.


తమ పనిమనిషి పిల్లలు ముగ్గురిని చంపాపేట్ జడ్.పి.స్కూల్లో చేర్చి వారి కి కావలసిన బుక్స్ బ్యాగులు కొని ఇవ్వటమేగాక బీదపిల్లలకి సాయం చేయడం ఫ్రీగా చదువు చెప్పడం చేసేవారు. ఈవిధంగా హేమ లతో గారు తన కూతురు మమతా లో బాల్యం నుంచి సేవాభావం బీజాలు నాటిఆదర్శ తల్లిగా నేటికీ సలహా సంప్రదింపులు అండదండగా నిలుస్తున్నారు
తర్వాత జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్స్ లో పీజీ డిప్లమా చేశారు హేమలతా దేవి గారు. బేగంపేట మహిళా ప్రభుత్వ కళాశాలలో జర్నలిజం హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ గా రిటైర్ అయ్యారు. ఎంతోమందికి స్ఫూర్తి నిచ్చిన హేమలత గారు, తన స్టూడెంట్స్ మంచి పొజిషన్లో కి రావడానికి కృషి చేశారు. రిటైర్మెంట్ తర్వాత ‘తరుణి గురుకుల్’ అనే కాన్సెప్ట్ స్కూల్ పెట్టి వందల మంది పిల్లలకి నేటికి చదువు చెప్పిస్తున్నారు. ఈ పిల్లలందరూ చంపాపేట గ్రామంలోని బీద పిల్లలు. సాయంత్రం పూట ట్యూషన్లు చెబుతూ, వారందరిని స్కూళ్లలో చేర్చి, ఫీజులు కట్టి, వాళ్ళకు కావలసిన పుస్తకాలు స్టేషనరీ ఇచ్చి చదివిస్తున్నారు. వారి తల్లులకి టైలరింగ్ క్లాసులు పెట్టి ఎంతోమంది మంచి టైలర్ లను తయారు చేశారు. తల్లులను కూడా చదువుకోమని ప్రోత్సహించి వారితో హిందీ పరీక్షలు, ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాయించి కొత్త ఉపాధిలోకి వెళ్లేటట్లు చేశారు. 75 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ తరుణి డైరెక్టర్ గా ఎన్నో విధులు నిర్వహిస్తూ స్త్రీలందరికీ ఆదర్శంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నోబెల్ సాహిత్య గ్రహీత ఇటలీ రచయిత  గ్రేజియా డెలెడా

విముక్తి చేద్దాం రండి