ఒరేయ్ నానీ, ఇంకా మూడు రోజులలో పరీక్షలు, పుస్తకాలు తియ్యి చదువుకుందువుగాని అరచింది మాలతి. అబ్బ, ఉండమ్మా, ఇంకా నాలుగు రోజులు ఉన్నాయిగా, చదువుతానులే అని విసుక్కున్నాడే గాని లేవలేదు నాని. అదేమిటిరా ఎపుడు చదువుతావు? అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. నీవు ఎప్పుడూ ఇంతే. ముందుగా చదువుకోవు. చివరకు పరీక్షలు ముందు నా ప్రాణం తీస్తావు, లే చదువుకో అరచింది మాలతి. కూర్చున్నచోటు నుంచి కదలకుండా విడియో గోమంలో నిమగ్నమయిపోయినాడు. చేసేది లేక వదిలేసింది మాలతి.
పరీక్షలు రానే వచ్చాయి. రాత్రి 12 గంటల దాకా చదివాడు. వాడు పడుకోలేదు. అమ్మను పడుకోనీయలేదు. అమ్మ అన్నీ చదివి వినిపిస్తే హడావుడిగా కొంత చదివి, కొంత విని స్కూలుకు వెళ్లాడు. ప్రతి పరీక్ష ఇదే తంతు. ముందుగా ఎందుకు చదవడో, అర్థం కాదు, నిట్టూర్చింది మాలతి. పరీక్షలు కాగానే ఆ శ్రమవల్ల జ్వరం వచ్చింది వాడికి. మాలతికి మళ్ళీ వాడి సేవ తప్పలేదు. ఏమిటిరా ఇంత బద్ధకం. ముందుగా ఎందుకు చదువుకోవు? అరచింది మాలతి. నవ్వి వెళ్ళిపోయినాడు. ఇదీ ఒక ఇంట్లో పరిస్థితి.
సిరీ, నా షూస్ ఎక్కడ, గావు కేక పెట్టాడు రవి.
అక్కడే షెల్ఫ్ లో ఉన్నాయి చూడండి అరచింది వంటింట్లో నుంచి శిరి. నా సెల్ ఫోన్ కనబడటం లేదు. ప్లీజ్, వెతకవా సిరీ, బ్రతిమిలాడాడు. విసుక్కుంటూ వచ్చి వెతికి ఇచ్చింది సిరి. బాత్ రూమ్ లో ఉన్నది అందుకే అంటా ఎక్కడి వస్తవు అక్కడే పెట్టాలని, అపుడు ఈ గోల ఉండదుగా, వినరుగా మీరు అన్నది విసుగ్గా.
తాంక్ యూ (Thank you) వస్తా. నవ్వుతూ స్కూటర్ వైపు నడిచాడు. అది కదలలేదు. పెట్రోల్ అయిపోయింది. నిన్న మరచిపోయాడు పోయించుకోవటం, ఈడ్చుకుంటూ పెట్రోల్ షాపు వైపుకు తీసికెళ్లాడు. ఆఫీసు చేరేటప్పటికి ఆలస్యమయింది. హడావుడిగా కాబిన్ లోకి వెళ్ళబోతుండగా బాస్ చూసి ఏమయ్యా ఇంత ఆలస్యం, ఏదో పని బాగా చేస్తావని ప్రమోషన్ ఇస్తే రోజూ ఆలస్యం. ఏమిటీ గోల అన్నాడు కోపంగా. పెట్రోల్ అయిపోయింది సార్ స్కూటర్ లో. పోయించుకుని వచ్చటప్పటికి ఆలస్యమయింది అన్నాడు. ఇదీ ఒక ఉద్యోగి పరిస్థితి.
పెళ్లి కూతురు రెడినా అడిగాడు మేనమామ.
తయారు అవుతున్నది చెప్పారు ఇంట్లోవాళ్ళు. ఎంతసేపు? ముహూర్తం టైము అవుతున్నది. దూరం వెళ్ళాలి మండపం చేరుకోవటానికి మగపెళ్ళివారు వచ్చేశారట. అరిచాడు ఆయన. ఆ వస్తున్నాం, వస్తున్నాం అంటూనే మరో అరగంట ఆలస్యం.
చివరకు ఎలాగో అరవంగా, అరవంగా బయలుదేరారు అందరు. త్రోవ అంతా ట్రాఫిక్ జామ్. కారు నెమ్మదిగా నడుస్తున్నది. పెళ్ళి కొడుకు వైపు వాళ్ల నుంచి ఫోన్ల మీద ఫోన్లు. మధ్యలో మామయ్య దిగి, పోలీసులను బ్రతిమిలాడుకొని ముందుగా వీళ్ళ కారు వెళ్ళేటట్లుగా చేసుకొని తిన్నగా మండపం చేరారు.
అప్పటికే పీటల మీద కూర్చుని ఉన్నాడు పెళ్ళి కొడుకు. అందరూ తలకాయలు త్రిప్పి మరీ వింతగా చూశారు వీళ్ళను. ఇదంతా సమయానికి తయారు కాక పోబట్టి కదా? విసుక్కున్నారు అందరూ. ఇదండీ మన ఇళ్ళల్లో కాలం విలువ, సమయ పర్యవేక్షణ. ముందు జాగ్రత్తలు ఉండవు. సమయ నిబంధన పాటించరు ఇళ్ళలోనే కాదు. ప్రపభుత్వ పనుల తీరులో కూడా ఇంతే. వరదలు వస్తాయి. అప్రమత్తంగా ఉండండని ప్రజలకు చెప్తారు. వాళ్లేమి చేస్తున్నారు? ముందు జాగ్రత్తగా. రోడ్లను బాగు చేస్తున్నారా? గుంటలను పూడుస్తున్నారా? తీరా వరదలలో కొంతమంది కొట్టుకుపోతే, కొంతమంది చనిపోతే అప్పుడు యుద్ధ ప్తాతిపదికకతో చర్యలు మొదలు పెడతారు. కొన్ని ప్రాణాలు బలి కావలసిందేనా ప్రభుత్వ ఆలస్సాలకు? రోడ్డు మరమ్మత్తులు వానాకాలంలో మొదలు పెడతారు. వాన వచ్చిందని ఆపుతారు. ఎండా కాలంలో మొదలు పెడతారు. వాన వచ్చిందని ఆపుతారు. ఎండాకాలంలో తెలియదా? వర్షాకాలం వస్తుందని. వానలు విపరీతంగా ఉంటాయని మొన్నటికి మొన్న ఉక్రేయిన్ యుద్ధంలో విద్యార్థులనందరిని బంకరంలలోకి వెళ్ళమని, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. మరి వాళ్ళ ఆకలి సంగతి ఆలోచించారా? ఆహారం సరిపడా ఉందే లేదో చూశారా? తీరా కర్ణాటక విద్యార్థి ఆకలి ఆపుకోలేక, బయటికి వెళ్ళి బాంబులకు బలైనప్పుడు యుద్ధ ప్రాతిపదికాన 22 విమానాలు పంపి మిగతా అందరిని క్షేమంగా ఇంటికి తెచ్చారు. ఒక్క రోజులోనే వేలమందిని తెచ్చారు కదా? ముందే ఈ ఆలోచన ఉంటే ఆ విద్యార్థి బలి అయ్యేవాడు కాదు కదా? ఆ విద్యార్థి మరణానికి కారకులు ఎవరు? సమయ నిబంధన లేకపోబట్టే కదా? ఎందుకు మారరు, ఈ ప్రభుత్వాలు, ఈ జనాలు? మీ ఈ బద్దకం వల్ల, సమయ నియంత్రణ లేకపోవటం వలన ఎన్ని కష్టాలు వస్తున్నాయో ప్రజలు గమనించుకోవాలి. మారటానికి ప్రయత్నం చేయాలి. అందరూ ఆలోచించండి. సమయ నియంత్రణ పాటించండి. జాగ్రత్తగా ఉండండి.