దసరా – సరదా

బెడ్ మీద హాయిగా పడుకొని పాటలు వింటున్నా.  త్వరలో దసరా రాబోతున్నది కదండీ మన ఊళ్లల్లో పిల్లలు పాడే దసరా పద్యాలు, పాటలు సరదాగా విందాము అని అనౌన్సర్ అనౌన్స్ చేసింది. ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాటలు. ఇన్నాళ్లకు మళ్లీ వినబోతున్నా. కుతూహలంగా చెవులు రిక్కించి వింటున్నా.

జయీభవ, దిగ్విజయీభవ, దసరాకు వస్తమని, విసవిసలు పడక రేపురా, మాపురా అని కాదనక ఇచ్చి పంపండి.

అయ్యవారికి చాలు ఐదువరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు. జయీ భవ, విజయీభవ.

పావలా ఇస్తేను పట్టేది లేదు, అర్థరూపాయి ఇస్తే అంటేది లేదు. ముప్పాలా ఇస్తే ముట్టేది లేదు, ఇచ్చరూపాయి ఇస్తే పుచ్చుకుంటాము. ఆనందంగ వింటుంటే మా స్నేహితురాలు వచ్చింది. ఇంకా ఆ పాత కాలపు పాటలు ఏమి వింటావు? నీవు రచయిత్రివే కదా. ఏదైనా క్రొత్త పద్యాలు వ్రాయకూడదా, అంటూ కూర్చుంది. చూస్తా అన్నాను. చూస్తా కాదు, వ్రాయాలి. నాకు చూపించాలి అంటూ కూర్చని కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. అప్పుడు తీరికగా ఆలోచించా. అవును, నేను కూడా దసరా పద్యం ఎందుకు వ్రాయకూడదూ అనిపించింది. మొదలు పెట్టాను.

జయీ భవ, విజయీభవ, పిల్లలం మేము పిడుగులఁ. దసరా మామూళ్ళ కు వచ్చాము. లేదనక,. కాదనక మేము అడిగింది ఇచ్చి పంపండీ.

పది రూపాయలు ఇస్తే పట్టేది లేదు. యాభై రూపాయలు ఇస్తే

ఏడుస్తాము. వంద రూపాయలు ఇస్తే విసుక్కుంటాము.

ఇచ్ఛవేయి రూపాయలు ఇస్తే పుచ్చుకుంటాము. ||జయీ భవ||

అయ్యవారికి చాలు ఐదు లకారాలు

పిల్లవాండ్రకు చాలు స్మార్ట్ ఫోన్లు

అడిగినవి కాదంటే వదలము మిమ్ము.

ఇక్కడే కూర్చుని, అలిగి అందరిని పిలిచి యాగీ చేస్తము ||జయీ భవ||

కొడుకులకు కొడుకులుఁ కలిగి

మనుమలకు మనుములుం కలిగి అని, పాత దీవెనలు చేయము మేము.

ఒక్క కొడుకు, ఒక్క కూతురు కలిగి

ఒక్క మనుమరాలు కలిగి వర్థిల్లు తాతా ||జయీ భవ, దిగ్విజయీభవ||

వెయ్యి రూపాయల కయినా వేడుక చేయలేమయా

పది చాక్ లెట్లు కూడా రావాయె, ఒక మంచి బొమ్మ కూడా రాదాయె

ఇంకా పిల్లలు పాడుతున్నారు. మధ్యలో అయ్యవారు అందుకొని

కరోనా వచ్చి కష్టాలలో ఉన్న రోజులని, సర్దుకుంటమయా

అన్నారు. మళ్ళీ పిల్లలు అందుకొని, జయీ భవ, విజయీభవ

మరుసటేడు పదివేలు ఇయ్యాలె.

లేకుంటే కిటికీలు అద్దాలు పగల గొడతమిలా అని చేతిలో విల్లు ఆకారంలో ఉన్న బొమ్మ గన్ ని గాలిలోకి పేల్చారు.

ఆ బొమ్మ గన్ శబ్దానికి ఇంట్లో ముసలమ్మ అదిరి పడింది. ఆడపిల్లలు కూడా మేము తక్కువ కామని చేతిలో ఉన్న కోతి బొమ్మలకు ‘కీ’ ఇచ్చి క్రింద వదిలారు. అవి ఎగురుతుంటే ప్రాకాడే పిల్లలు ఏడ్చారు.

ఇహ లాభం లేదని, వాళ్ళ పాటలు నచ్చకపోయినా ఏదో ఇన్నాళ్ళకు దసరా అంటూ వచ్చారు కదా అని వాళ్ళకు వేయి రూపాయలు, అయ్యవారికి, ఇంతకన్నా ఇవ్వలేమని చెప్పి మూడువేల రూపాయలు ఇచ్చి దణ్ణం పెట్టాము. ఆయనకూ వచ్చిందే చాలని, తనకు వచ్చిన ఆశీర్వచనం చేసి పిల్లలను తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా ఏదన్నా వ్రాద్దామనుకుంటుండంగా మళ్ళీ మా స్నేహితురాలు వచ్చింది, వ్రాశావా అంటూ వ్రాసినంతవరకూ చూపించా. బాగుంది.

ఈ కాలం పిల్లల బుద్ధికి తగ్గట్లు, ధరలకు తగ్గట్లు వ్రాశావు. బాగుంది. ఏదైనా ప్రతికకు పంపించు అని తన అభిప్రాయం చెప్పంది. మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయండి. ఉంటా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

అప్పులిస్తున్నారు జాగ్రత్త?!