మానవత్వం పూల తోటలో మనుషులంతా ఒక్కటేనని
పాడరా ఓ భారతీయుడా పాడరా ఓ సోదరా ||మా||
ప్రజారాజ్యం ప్రజాస్వామ్యం ఆశయాలకు ఆలవాలం
అని పాడరా ఓ తమ్ముడా అని పాడవే ఓ చెల్లెలా ||మా||
పల్లె పల్లెకు పాఠశాలలు భావి పౌరుల ప్రగతి బాటలు
అని పాడరా ఓ తమ్ముడా అని పాడవే ఓ చెల్లెలా ||మా||
సర్వమతముల సామరస్యం సర్వ జనులకు సౌఖ్యదాయం
అని పాడరా ఓ తమ్ముడా అని పాడవే ఓ చెల్లెలా ||మా||
మంచి ఒకటే నిలుచునెపుడు పరుల పంచన చేరకెపుడు
వంచనే మదిలో నెంచక చిరకీర్తి పొందర ఓ సోదరా ||మా||
చిరకీర్తి పొందవె ఓ చెల్లెలా ||మా||