లేడి కండక్టర్

రోడ్డు రవాణాలోని నీ పాత్ర సదా స్మరణీయం

గమ్యస్థానం చేర్చడంలోని పాట్లు

నీవు పడే అగచాట్లు తరచి చూస్తే

పోరాట పటిమ నెరిగిన నారీ స్ఫూర్తి గోచరిస్తుంది.

నీ చిన్ని ప్రపంచంలో పెను సవాళ్ళెన్నో!

వృత్తి ధర్మానికి సున్నితత్త్వం తగదని కాబోలు

ముఖానికి ‘కరకుదనపు’ ముసుగు నాకైతే…

ఓ ఆభరణంలా తోస్తుంది సుమా!

నీ సుదీర్ఘ ప్రయాణంలో ప్రయాణీకులే

హితులు నేస్తాలు రోజువారీ పలకరింపులే

రూపాంతరం చెందిన ఆత్మీయ బంధాలు

అమ్మాయిలకు అండగా రక్షణ కవచమై

నిలుస్తూ ఆకతాయిలపై గర్జించే కవచమై

నిలుస్తూ ఆకతాయిలపై గర్జించే నీ బలమైన

గొంతుక జూలు విదిల్చిన ఆడసింహాన్ని

తలపిస్తుంది అలుపెరుగని నీ సేవా నిరతి

శ్లాఘనీయమై చరిత్ర పుటలో నీ స్థానాన్ని

పదిల పరచింది

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అధ్యాపిక

కవి