ప్రముఖ రచయిత్రి శ్రీమతి సుజలమూర్తి !
ఆమె పేరు సూర్య జయలక్ష్మి.అలా ఎవరికీ తెలీదు.కానీ సుజలమూర్తి అనగానే ఆమె ఓప్రసిద్ధ రచయిత్రి అని ఠక్కున తెలిసిపోతుంది.ఆమె తన గూర్చి తరుణి తో ఇలా పంచుకున్నారు “మా ఇంటి పేరు గంటి. మాఅమ్మ నాన్న ల12మంది సంతానం లో నేను ఆఖరుదాన్ని.నాబాల్యం నాకు తెలీదు.అక్కలే పెంచారు.నా8వ ఏట మెదక్ లో ఉన్న పెద్ద అన్నయ్య దగ్గర ఉన్నాం.6_11వక్లాస్ దాకా గవర్నమెంట్ స్కూల్ లో చదివాను.మానాన్న సంగీతం నేర్పించారు.సర్వశ్రీ మంగళంపల్లి నూకలచినసత్యనారాయణ విద్వాంసులు మాకు బంధువులు.మా అమ్మాయి కథక్ డాన్సర్.నాభర్త ప్రోత్సాహం తో హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నాను.పెద్ద పెద్ద సంగీత విద్వాంసులకి తంబూర వాయించేదాన్ని.నాభర్తకి తరచూ విదేశాల్లో పనిపై వెళ్లాల్సి ఉండటంతో నాముగ్గురు పిల్లల ఆలనా పాలనా అంతా నాదే! ఇప్పుడు ముగ్గురు మంచి హోదాలో ఉండటం నాకు గర్వకారణం!
ఇక బాధ్యతలు వదలడంతో నాభర్త ప్రోత్సాహం తో కథలు రాయడం మొదలు పెట్టాను.అసలు బాల్యం నుంచి కనపడ్డ చిత్తు కాగితం తో సహా చదివేదాన్ని.కాశీమజిలీలు భారతంతోసహా మంచి కాలక్షేపం ! మావారి నక్షత్రం అనురాధ.అందుకే ఆకలంపేరుతోమొదటి కథ ఆంధ్ర ప్రభలోపడింది.ఆచంట ఉమాదేవి గారి తో పరిచయం నాకు దొరికిన పెన్నిధి అనే చెప్పాలి.నా60వఏట రాయటం మొదలు పెట్టినా అవార్డు రివార్డులు రావటం గొప్ప విషయం గా భావిస్తాను.మొదటినవలకే అవార్డు రావడం నా అదృష్టం! మావారు రాయించి ప్రోత్సాహం ఇవ్వటం గొప్ప అదృష్టం గా దేవుని వరంగా భావిస్తాను.ఆంధ్రభూమి కూడా చేయూత నిచ్చింది.నాపిల్లల తర్వాత నే నా రచనలు.
19నవలలు70కథలు రాశాను.కన్నడంలో ఓకథ అనువాదం వచ్చింది.డిటెక్టివ్ హాస్యకథలు పిల్లల నవల రాశాను.అమెరికా జీవితం నుంచి చిత్రించాను ఓకథలో.లేట్ గా మొదలు పెట్టినా లేటెస్ట్ భావాలతో రాస్తున్నాను.55వ ఏటకంప్యూటర్ నేర్చుకున్నాను.40ఏళ్లు నార్త్ ఇండియా లో గడిపాను.రకరకాలకుట్లు అల్లికలు పైజామా లతో కుట్టే దాన్ని.వేస్ట్ మెటీరియల్ తో రకరకాల వస్తువులు చేశాను.
ఇక నాకు జైనీ అవార్డు తెలుగు యూనివర్సిటీ అవార్డు వచ్చాయి”. బాధ్యతలు వదిలాక కలం చేపట్టిన ఆమె జీవితం వడ్డించిన విస్తరి అని పించింది
ఈమె చేతితో చేసిన కాగితం బొమ్మలు
సుజలగారి గురించి బాగా పరిచయం చేసారండి. కానీ ఆవిడ గురించి తక్కువగా చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు. చాలా బాగుందండి.