తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక ఊహా చిత్రం

 

తొలి తెలుగు రామాయణ కర్త అయిన గోన బుద్దారెడ్డి ఇంటి ఆడపడుచు కుప్పాంబిక
మల్యాల గుండనాథుని భార్య. ఈమె తొలి తెలుగు కవయిత్రిగా గుర్తింపు పొందినది.
1270 దశకంలో గుండయ్య చనిపోయిన తర్వాత, కుప్పాంబికే పాలన పగ్గాలు చేపట్టిందంటారు. అప్పటికామెకి 35-40 సంవత్సరాల వయసుంటుందేమో. అంచేత ఆమెని వీర వనిత అనడం సబబు.

కుప్పాంబిక చరిత్ర కేవల కల్పనా కథ కాదు. శాసనస్తమయిన ఆధారాలు ఉన్న అస్తిత్వం ఆమెది.
తన భర్త మల్యాల గుండనాథుడు మరణించిన తర్వాత బూదపురం (నేటి మహబూబ్ నగర్ జిల్లా లోని భూత్పూరు)లో క్రీ.శ.1276లో ఒక శాసనం వేయించింది.

ఈమె రచనలు కాని, వాటిపేర్లు కాని లభ్యం కాలేవు. అయిననూ అయ్యలరాజు తన సంకలన గ్రంథంలో కుప్పాంబిక పద్యాలను ఉదహరించాడు

‘నవజాతాంబకు డేయు సాయకములన్ వర్జింపగా రాదు, నూ
తన బాల్యాధిక వనంబ మదికిన్ ధైర్యంబు రానీయ ద
త్యనురక్తిన్ మిముబోంట్లకున్ దెలువ నాహా! సిగ్గుమైకోదు, పా
వన వంశంబు స్వతంత్రమీయదు, చెలీ! వాంఛల్ తుదల్ముట్టునే’

ఉక్కిరిబిక్కిరి చేసే ‘యవనవ్వనం’ ఎవరినీ క్షమించదు. ‘వాంఛల్ తుదల్ముట్ట’డం కూడా సహజమే. సిగ్గు కూడా ఎవరికీ తప్పని ఓ సహజావస్థ. వీటన్నిటికీ తోడు, ‘పావన వంశంబు’లో పుట్టిన వాళ్లకి – ముఖ్యంగా ఆడపడుచులకి – అదనంగా సంప్రాప్తించే దుర్గతి మరొకటి ఉంది; అదే పారతంత్య్రం

రూపాదేవి,ఉపాధ్యాయురాలు
PhD scholar
చిత్రకారిణి, కవయిత్రి మా ఊరి ముచ్చట కవితా సంపుటి పుస్తక రచన చేసినారు

Written by Rupa devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఏది సాధికారత

మన మహిళామణులు