ఊహల వాహిని పై భావాల వంతెనలు కట్టి
అనుభవాల రాశులను ప్రేరణలుగా మూటలు గట్టి
భావ రాగ మధురిమలను పల్లవిగా పాట గట్టి
అంతులేని కావ్య సోపానాల
అనువైన అందాల భాష్యాల మేడలు గట్టి
ఉల్లాసం తోడుగా ఉత్సాహం నీడగా
భావావేశాల ప్రేరణా నిలయమై
భాషా ప్రవాహాన అనంతవలయమై
మనసు కాగితాన్ని సిరాసుధలతో నింపి
మనోహర భావరస సారధై
హృదయ వెల్లువల వారధై
మనో రంజిత కావ్య మాలికలల్లి
మంజుల నాదాల సిరిమల్లెలు చల్లి
వాక్చాతుర్య లిఖిత రూపు
భావ ధారలై ప్రజ్వలించి
అనుభూతుల అక్షరాలు పేర్చి
అద్వితీయ కవిత్వాన్ని కూర్చి
అనుభవాల కావ్యాల్ని తీర్చి
ఉజ్వల ప్రతిభ
ధృవతారై
రసధారై
కీర్తి కైవసాన రసజ్ఞ మూర్తి
నవ్య పాండిత్య భరిత కళామూర్తి
ఒక నవ్య కవిత చక్రవర్తి
-ఆదర్శ్ నగర్,హైదరాబాద్
This post was created with our nice and easy submission form. Create your post!