ద బెస్ట్

నిజం చెప్పాలంటే స్త్రీ మనసును తెలుసుకొనడం చాలా కష్టం. త్రిగుణాత్మకమైన ప్రకృతికి ప్రతీకయైన స్త్రీ కూడా ప్రకృతిలో నెల నెలా ఏవిధంగానైతే మార్పు ఉంటుందిో ఆమె శరీరంలో,మనసులో కూడా అలాగా మార్పు జరుగుతుంది. ఈ అవస్థ పురుషుడికి లేదు. ఈ మార్పుల వల్ల ఆమె మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఆమె మనసులో కలిగే అలజడి వల్ల కొన్ని పనులు చేయగలుగుతుంది. కొన్ని చేయలేదనే విషయాన్ని భర్తతోపాటు కుటుంబీకులు అర్థం చేసుకోవాలి. కానీ కుటుంబంలో ఉన్న సాటి స్త్రీలే గ్రహించలేరు. గర్భిణీ స్త్రీ పరిస్థితి కూడా అదే.
స్త్రీ తత్వం యొక్క గొప్పతనం ఏమిటంటే ఆమె మనసులో విషయాన్ని తనంతట తాను చెప్పదు. ఎదుటివారు గ్రహించాలి అనుకుంటుంది. అందుకే ప్రాచీన కవి కాళిదాసు కూడా ఎప్పటికీ అర్థం కానిది స్త్రీ అన్నాడు. దానికిక్కారణం ఆమెలో తరచుగా జరిగే మార్పు. ఇంత సంక్లిష్టత మగవారిలో ఉండదు. ఆమె మనసు గ్రహించి ఏ చిన్న వస్తువు భర్త లేదా కుటుంబీకులు తెచ్చినా’నా
ఏ చిన్న వస్తువు భర్త లేదా కుటుంబీకులు తెచ్చినా’నా కోసమే తెచ్చారు కదా, నన్నుగుర్తుంచుకొని తెచ్చారు కదా’ అని చిన్న పిల్లల మనస్తత్వం తో ఆనందిస్తుంది. అంతేకాదు ఆమె భర్తకు బానిస అయి పోవడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. ఆనందంతో అతనికి సర్వ చాకిరి చేయడానికి సిద్ధపడుతుంది.చేస్తుంది. ప్రేమకు ఆ విధంగా లొంగిపోతారు. అమాయకపు ప్రేమ. కానీ ఇది చాల తక్కువ కుటుంబాలలో జరుగుతుంది. పెద్దపెద్ద ఉద్యోగాలలో ఉంటూ, అనేక రంగాలలో దేశాన్ని ముందడుగు వేయించే మహామహులు కూడా కుటుంబ విషయం వచ్చేసరికి విఫలమైపోతున్నారు. దీనికి క్కారణం భార్య పట్ల చులకన భావన కావచ్చు. నిర్లక్ష్యం చేయటం కావచ్చు. ఇంటికి వచ్చేవరకు కూడా ఆమె ఉనికిని మర్చిపోవటం కూడా కావచ్చు. ఆమె మనసు తెలియక పోవడం తప్పు కాదు కాని తెలుసుకోకపోవడం మాత్రం తప్పు. ఇంకా చెప్పాలంటే అహంకారం. త్యాగం లోనూ, ఎదుటి వారిని అర్థం చేసుకోవటంలోనూ, వాళ్లకు అనుకూలంగా ఉండటం లోనూ కలిగే ఆనందాన్ని పొందలేకపోతున్నారు. ముఖ్యంగా ఆధునిక స్త్రీ ని అర్థం చేసుకోవటంలో ఆధునిక పురుషుడు పూర్తిగా విఫలం అవుతున్నాడు. ఎందుకంటే ఈ నాటికి కూడా పురుషుడు స్త్రీ నుండి పూర్వకాలపు సేవలను, అంకిత భావాలను ఆశిస్తున్నాడు. అలా కాకుండా ఆ ఆలోచన నుండి పురుషుడు బయటపడి ఆనాటి స్త్రీ కంటే ఈనాటి స్త్రీ విద్యా విషయంలో గాని, ఉద్యోగ విషయంలో గాని, ఇంట్లో తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే అంచెలంచెలుగా ఎలా విజయాలను సాధిస్తుందో అర్థం చేసుకోగలగాలి.
ఇక్కడ ఒక చిన్న కథ. అనగా అనగా ఒక రాజు. ఇతడు చాలా నియంత. ఒకసారి పొరుగుదేశపు రాజు తో చేసిన యుద్ధంలో అతడిని ఓడించి భందీగా తీసుకొస్తాడు. కానీ ఆ నియంతకు కూడా యువరాజును చంపటానికి మనసొప్పక “నేను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం చెప్తే నిన్ను వదిలేస్తాను. అందుకు ఒక సంవత్సర కాలం తీసుకో. ఆ ప్రశ్న ఏమిటంటే ‘అసలు ఆడవాళ్లకు ఏం కావాలి.’? అని అడుగుతాడు.
అందుకా యువరాజు ఒక సంవత్సర కాలం చావు నుండి తప్పించుకున్నాననుకుని అతని స్నేహితునితో పాటు( ఆ స్నేహితుడు తన మంత్రి కుమారుడు) రాజు అడిగిన ప్రశ్నకు సమాధానానికి రీసెర్చ్ లాగా చేసినా, ఏ రకంగా ప్రయత్నం చేసినా సమాధానం దొరకలేదు. మూడు రోజుల గడువు ఉండగా ఎవరో ఒకామె ఆ రాజును పిలిచి ఇక్కడ ఒక అందవిహీనమైన ఒక రాక్షసి ఉంది. ఆమెనడిగితే ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుంది అని చెప్పింది. యువరాజు ఆమె దగ్గరికి వెళ్లి రాజు అడిగిన ప్రశ్నను ఆమెను అడిగినప్పుడు దానికి సమాధానంగా ఆమె ఒక షరతు పెడుతుంది. అదేమిటంటే “నీ స్నేహితుడికి నాతో పెళ్లి జరిపిస్తే సమాధానం చెప్తాను” అంటుంది. యువరాజు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా స్నేహితునికి ఈ రాక్షసి తో పెళ్లి జరగకూడదని నిశ్చయించుకుంటాడు. కానీ యువరాజు స్నేహితుడు తన స్నేహితున్ని బతికించుకొను టకై ఆమెను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొన్నందుకు యువరాజు అడిగిన ప్రశ్నకు రాక్షసి సమాధానంగా ” స్త్రీ ఎప్పుడూ తనజీవితం తనచేతిలోనే వుంచుకోవాలనుకుంటుంది.” అని చెప్పి యువరాజు స్నేహితున్ని వివాహం చేసుకుంటుంది. తర్వాత స్నేహితుడు గదిలోకి వెళ్లేసరికి ఆ అందవిహీన అప్సరసలా కూర్చొని ఉంటుంది. ఆశ్చర్యపోతున్న అతనితో ఆమె “ఈ నా అందం ఉదయం లేదా రాత్రి మాత్రమే ఉంటుంది. అంటే రోజంతా ఉండదు.ఈ అందం ఎప్పుడు ఉండాలో కోరుకోమని” అడుగుతుంది. దానికి అతడు” నీ ఇష్టం. నీకెప్పుడు ఏ విధంగా ఉండాలి అనిపిస్తే అదే విధంగా ఉండు.” అని చెప్తాడు. దానికి ఆమె సంతోషించి “నువ్వు నాకే చాయ్స్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది. అందుకని నేనెప్పుడూ ఇలాగే అందంగా ఉంటా”నని చెప్తుంది.
ఈ కథలో విషయం ఏమిటంటే ఆమె జీవితానికి ఆమెనే ఇంచార్జి చేసినప్పుడు అంటే నిర్ణయాలను ఆమెకే వదిలేసినప్పుడు ఆమెకు ఎంతో సంతృప్తి కలిగింది. మరొకటి ఏంటంటే ఆమెకు అలా ఛాయస్ ఇచ్చినప్పుడు ఆమె ద బెస్ట్ గా ఉండటానికే ప్రయత్నించింది. ఇది ఆ అందవిహీనుని రాలి మనస్తత్వం మాత్రమే కాదు.అంటే ప్రతి స్త్రీ ది. ప్రతీ స్త్రీలో రాక్షసి ప్రవర్తన లేదా గయ్యాళితనం కాకుంటే ఆకర్షణీయంగా కనబడక పోవటం లాంటి ఏదో నెగెటివిటీ ఉంటుంది. అఫ్ కోర్స్ మగ వాళ్ళలో కూడా ఉంటాయు.. కానీఆడవాళ్ళ లా మగవాళ్లకు ఓర్పు ఉండదు. ఆ నెగిటివిటీని భర్త విమర్శించకుండా, అవమాన పరచకుండా ఓపిగ్గా మేనేజ్ చేసుకుంటే ఆమె దాన్ని అధిగమించటానికి ప్రయత్నిస్తుంది. ఆమె అందంగా, ఆమె ప్రవర్తన అందంగా ఉండటానికి, ద బెస్ట్ అనిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నృత్యగణపతి