ఏడు దశాబ్దాల పాటు బ్రిటిష్ సామ్రాజ్యాధికారిగా సార్వభౌమాధికారాన్ని నేర్పిన ఏకైక మహిళా మణి క్వీన్ ఎలిజిబెత్. మన మాట లో ఆమె
మేరున్నగధీర. ఆమెకు సాటి మరెవ్వరూ లేరు , మరెక్కడ సాటి రారు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో నిలబడి నెగ్గి ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న రాజకీయ చైతన్యం ఆమెది.
1926 వ సంవత్సరం ఏప్రిల్ 21 న జన్మించిన ఎలిజబెత్ 1952 తన 25 వ ఏట బ్రిటిష్ సార్వభౌమాధికారిగా బాధ్యతలు చేపట్టింది. ఆమె పూర్తి పేరు ప్రిన్సెస్ ఎలిజిబెత్ అలెగ్జాండ్రా మేరీ
ఈ పురుషాతిక్య ప్రపంచంలో ఆమె అతి చిన్న వయస్సులో ఆమె తీసుకున్న బాధ్యత ఈ 2022 సెప్టెంబర్ 8న ఆమె 96 వ ఏట విశ్రాంతి తీసుకున్నది. ఎందరో మహిళలకు ఆదర్శమైనటువంటి ప్రేరణ అయినటువంటి మరణమే లేదు. చరిత్ర కొత్త పాటలు రాసుకుంటూ ఉన్న మొట్టమొదటి పాదంలో మొదటి అక్షరం గా ఎలిజిబెత్ రాణి వేరే నిలుస్తుంది. కామన్వెల్త్ దేశాలకు బాధితులు వహించిన బ్రిటన్ సాయిధ తెల్లాలకు కమాండరించిఫ్గా పనిచేసిన సుప్రీం గవర్నర్ ఆఫ్ ఇంగ్లాండ్ గా కీర్తి గడించినా ఆమెకు ఆమెనే సాటి .ఆమె భర్త గత సంవత్సరం మరణించాడు. అప్పుడు అతనికి 99 ఏళ్లు. ఈ వృద్ధ దంపతులు కొడుకులతో కూతుర్లతో మనుమలతో మునిమనుమలతో నిండైన జీవితాన్ని అనుభవించినారు.
సాంఘిక సామాజిక రాజకీయ విధానాలన్నీ కూడా క్వీన్ ఎలిజిబెత్ (2nd) కనుసన్నల్లో ఇన్నేళ్లు గడిచాయి. సమర్థవంతమైన పాలన ఆమెది. ఈమె తండ్రి కింగ్ జార్జ్ ( 6th) మరణించగానే బ్రిటిష్ రాజ్యాధిపతిగా అధికార పీఠం ఎక్కినప్పటినుండి ఇప్పటివరకు 15 మంది ప్రధాన మంత్రులను ఈ నిలిజిబెత్ నియమించింది. 14 మంది అధ్యక్షులు అమెరికాకు ఎన్నుకోబడింది ఈమె హయాంలోనే!
ఇవన్నీ సమర్థవంతమైన పాలన ఉంటుంది కాబట్టే సాధ్యమయ్యాయి. చెరగని చిరునవ్వు చెరగని ఆత్మవిశ్వాసం గంభీరత గర్వ భావము అన్నీ కూడా ఆమెకు పెట్టని ఆభరణాలే అయినాయి. మాటలో స్పష్టత భావంలో స్వస్థత ఉన్నప్పుడే ఎదుటివారిని ఆకట్టుకోగలరు శాసించగలరు అనేది ఎలిజిబెత్ పరిపాలన విధానాన్ని చూస్తే తెలుస్తుంది. క్వీన్ ఎలిజిబెత్ కి శ్రద్ధాంజలి ఘటిస్తుంది తరుణి పత్రిక.స్త్రీ శక్తికి ప్రతీక గా నిలిచిన ఎలిజబెత్ కు ఘనమైన నివాళులు అర్పిస్తుంది తరుణి పత్రిక యాజమాన్యం.
తరుణి సంపాదకులు కొండపల్లి నీహారిణి