అపసవ్యపు జీవన యానంతో
గతి తప్పిన బతుకు చిత్రంతో బేజారు
బెదరిన భావితరానికి భరోసాగా
ముఖానికి చిరునవ్వే ఆభరణంగా ఆమె
ప్రశాంత వదనానికి చిరునామాగా అతడు
ఆడంబరమెరుగని ఆత్మ సౌందర్యంతో ఆమె
విలువలెరిగిన నిబద్ధతతో అతడు
జీవన రథ చక్రాలు సజావుగా సాగేలా
స్థిర సారథ్యంలో ఆమె
సమాజపు సమ్మెట పోట్లకు తలవంచని
స్థిత ప్రజ్ఞతతో అతడు
అలుపెరుగని బ్రతుకు ప్రయాణంలో
అలజడులకు సడలని గాంభీర్యంలో వారు
సహజత్వం లోపించని సాహచర్యంలో
శ్రుతి తప్పని సుందర చైతన్యం వారు
అతని మెడలో రత్నమాలిక ఆమె
ఆమె సిగలో మణిభూషణం అతడు
by రాధికా సూరి
Chala bagundhi