చిత్రకారిణి – తేజస్విని , బి టెక్
జనగాం .
ఆకుపచ్చ ఆలోచన అందాల దృశ్యం
నల్ల మచ్చల పులి
మళ్ళ వచ్చిందోయి
పెంచిన వంచనకూ
పంచిన దుర్మార్గ ప్రవర్తన లకూ
పొంతనగా ఓ చిత్రం
బ్రతుకు తెరువు
తెలివిగా కంటి ఆవరణ అయినప్పుడు
నువ్వైనా నేనైనా నిదర్శనల రూపమైనప్పుడు
మనసు మెదడు సమదర్శనల సమ్యక్ దృష్టి సంఘర్షణ ల ఆత్మదీపం అయితీరుతుంది
బహుపరాకుగా కాక
బహు పరాక్ అనేలా
ఈ లోకం పోకడ లో పోల్చలేని ఉదాహరణ అవుతుంది
_ కొండపల్లి నీహారిణి