ఆమె మారింది నిజమే
కట్టెలపొయ్యి నుంచి గ్యాస్ స్టౌవ్ కు
బట్టలుతకడం నుంచి వాషింగ్ మిషన్ వరకు
ఆమె మారింది నిజమే
రుబ్బురోలు నుంచి మిక్సి వాడటంకు
నల్లాకు మంచినీళ్ళు పట్టుడు దగ్గరనుండి ప్యూరిఫైర్ నుంచి బాటిల్స్ పట్టి ఫ్రిజ్ లో పెట్టుడు వరకు
ఆమె మారింది నిజమే
పెరట్లో కూరగాయలు తెంపుకొచ్చుడు నుండి స్కూటిమీద రైతుబజార్ కి వెళ్ళడం వరకు
రాతెండి గిన్నెల్లో కూరలు వండుడు నుండి ప్రెస్టీజ్ పాత్రల వాడకం వరకు
ఆమె మారింది నిజమే
మగవారితో సమానంగా చదువుల్లో పోటీపడి ఉద్యోగాలు సంపాదించి
జీతం ఎంతొస్తదో నెలకోసారి మెసేజ్ లో చూసుకొని కొన్ని క్షణాలు సంబరపడేవరకు…
ఆ తరువాత ఇంటి లోనని కార్ లోననీ పిల్లల స్టడీ లోననీ
అన్నీ ఆడవారిపేరుమీద తీస్తే వడ్డీరేటు తక్కువ చేసి ఇచ్చే
ప్రభుత్వ బ్యాంకుల నుండి భర్త వరకు తాను కోల్పోయిన ఆర్థిక సాధికారత కు కుములుతూ
తనకు తానే అంతా నాకుటుంబం కోసమే కదా అనుకుని సంభాళించుకుంటూ
మారని విధిరాతపై కొత్తగా
మారిన అనుకునే ఆమె మారింది నిజమే కదా…
వకుళ వాసు
హన్మకొండ
998919833
అవును చాలా మారింది ఆమె…. చాలా బాగుంది వకుళ గారు 👌👌👌👌🙂🙏👍