మూల కారణాలు

లేనివి ఉన్నవి ఒక కలగలుపుల

గంప అయినప్పుడు

ఏరివేతల తీసివేతల

బ్రతుకు సమరానికి ఇదో మూలాధార చిత్రం

ఎన్ని నిర్భయ చట్టాలొచ్చినా ప్రయోజనమేమున్నది…

నేరం చేయాలంటే భయపడే పరిస్థితులు లేనప్పుడు?!

ఎన్ని నేరాలు నమోదైనా

ఏమి లాభం…

నేరస్తునికి తగిన శిక్ష పడనప్పుడు?!

ఎన్ని నీతిబోధలు చేస్తే ఏమున్నది…

అంగట్లోనే మత్తుమందులు,

అసభ్య దృశాలు దొరుకుతున్నప్పుడు?!

సమానత్వం కోసం ఆరాటమెందుకు…

పుట్టుక,పెంపకం నుండే

అసమానతలు,వివక్షలు రాజ్యమేలుతున్నప్పుడు?!

స్త్రీలకు రక్షణ లేదని అనుకోవటమెందుకు…

రక్షక భటులే నేరస్తులకు

కొమ్ము కాస్తున్నప్పుడు?!

కంటితుడుపు చర్యలెందుకు…

ఇన్ని అత్యాచారాలు, అఘాయిత్యాలకు మూలకారణాలను నిర్మూలించలేనపుడు!!!

*************

 

చంద్రకళ దీకొండ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Till it happens to you-నీకు జరిగే దాకా…

అపరాజిత