వాగ్గేయకారులనగానే వారికి సంగీతంలో ఎంతో ప్రావీణ్యత ఉన్నదని, సంగీత లక్ష్య లక్షణ శాస్త్రాలలో ఎంతో పట్టు ఉన్నదని మనము అనుకుంటాం. సంగీతశాస్త్రంలో ఎంతో పరిజ్ఞానం ఉంటేనే రచనలు చేస్తారనేది నిజం కాదని రుజువు చేశారు. మంగళం గణపతిగారు తనకి, సంగీతంలో ప్రవేశం లేదు. అయినా సరే సంగీత లోకం గర్వించదగ్గ వజ్రంగా మారారు.
మంగళం గణపతిగారు 26 ఫిబ్రవరి 1934లో తిరునల్వేళి దగ్గర మున్నిర్ పళ్లెం అనే గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య అయ్యర్, పార్వతి అమ్మాల్. పాఠశాలలోనే తన విద్యాభ్యాసాన్ని ముగించారు. తన తండ్రి తిలకార్ విద్యాలయంలో ఉపాధ్యాయులు ఈయన టాల్ స్టాయ్ కథలను తమిళంలోనికి అనువదించేవారు. మంగళం గణపతికి తన తండ్రి వద్ద భక్తి పాటలు, సంస్కృత శ్లోకాలు నేర్చుకునేవారు. కానీ, తన పెద్ద అక్కల వద్ద తరచూ శాస్త్రీయ సంగీతాన్ని వింటూ ఆనందించేవారు. తన వివాహానంతరం తిరువనంతపురంలో స్థిరపడ్డారు. అక్కడ తన మళయాళం నేర్చుకున్నారు. తన భర్త గణపతి కేరళ విశ్వవిద్యాలయంలో పనిచేసేవారు.
1998లో తన భర్త ఆరోగ్యం బాగా లేనప్పుడు, పూజలు బాగా చేయడం ప్రారంభించారు. అలా ఒకరోజు తాను గణపతి పూజ చేస్తుండగా చివరిలో ఆశువుగా “ఉ మహాగణపతి ఉపాస్మహే” అని పాడారు. కానీ, ఆ పాట ఏ రాగ తాళాల్లో పాడారో ఆమెకి తెలీదు. అది నాటకురంజి రాగంలో ఉన్నదని ఎవరో గుర్తించారు. ఆనాడే మురుగన్ మీద షణ్ముఖ ప్రియ రాగంలో, అమ్మవారి మీద కళ్యాణి రాగంలో కీర్తనలను రచించారు.
ఈమె ఎన్నో రచనలు చేశారు. పావనాశం శివన్ గారు వాటిని ఎంతో మెచ్చుకున్నారు. తన రచనలను స్వరపరచి రాయడంలో రుక్మిణి రమణి, ఎ.ఎన్.పంచవకేశ అయ్యర్ సహాయం చేశారు. తన ముద్ర ‘’మంగళం” అక్టోబరు 6, 1999న తన రచనలను కళావతి బాలకృష్ణ పాడి, క్యాసటు మరియు రెండు పుస్తకాలను విడుదల చేశారు. తను మళయాళంలో కూడా రచనలు చేశారు. హిందీలో భజనలు కూడా రచించారు. అంతేకాకుండా అపూర్వరాగాలైన ‘చంద్రజ్యోతి’లో కూడా రచనలు చేశారు.
వీటన్నిటినీ నిత్యశ్రీ మహదేవన్, మంబలం సిస్టర్స్ లాంటి గొప్ప సంగీత విద్వాంసురాళ్ళు పాడారు. ఇటీవల తన 10,000వ రచనను పూర్తి చేశారు.
తన రచనలు
కృతి రాగం తాళం
- గణనాథనే సారంగ ఆది
- లక్ష్మీనారాయణం మోహన ఆది (తిశ్ర గతి)
- బృందావన విహారి సింధుభైరవి ఆది
- వీణాపుస్తక శంకరాభరణం మిశ్రచాపు
- తాతువాలీన్ రేవగుప్తి ఆది
– పాలకుర్తి సుమన్వసిని
This post was created with our nice and easy submission form. Create your post!