ప్రణయ రాగం

అక్కడేదో మోహనరాగం స్వరాంజలయ్యింది

అమృత మోహన వలయంలో ప్రేమ వింజామరలు వీస్తున్నది

హృదయాలు రెండు ఏకమయ్యే

సమభావ సాంగత్యమది

హెచ్చుతగ్గుల పొరపొచ్చ కంటకాలులేని అనురాగబంధమది

భావి ప్రమాదాల సుడిగుండాలు దాటే ఆప్యాయతకో ఉదాహరణిది

అసమానతలు వీడి

రాగ రంజిత స్వరాలు ఊదుతున్నవి

పవిత్ర సౌందర్య సాధనమై నవరసాలొలుకుతున్నవి

అసమాన ధైర్యసాహసాలు అచంచలమైన విశ్వాసాలు

జంట పదాలు పలుకుతున్నవి

అవునూ

నీకైనా నాకైనా

ఏకైక ఎన్నికేదైనా ఉంటే

రాధాకృష్ణుల ప్రణయ గీతం ప్రమోద స్నేహ బంధాల తన్మయత్వమే

`by డా || కొండపల్లి నీహారిణి,     చిత్రకారిణి తేజస్విని, బి.టెక్

This post was created with our nice and easy submission form. Create your post!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మనబడి

మహిళా లైంగిక వేధింపు నిరోధక , నిషేధ మరియు సంస్కరణ చట్టము