తరుణిచిత్రం

చిత్రకారిణి. కె. పూజిత, ఎమ్.బి.ఏ హెచ్.ఆర్. గీతమ్ యూనివర్సిటి

వెన్నెల పువ్వులు పూయడం

ఉల్లములు విరియడం

పూవూ తావీ బంధం ఇది

మనస్సే ఓ నిండిన కొలనురూపు

ప్రకృతి ఒడి మురిపాల ముచ్చట్లు

కావలసిన తెలివల్లా

పర్యావరణ రక్షణ

సహజసంపదల్ని చేయని భక్షణ

ప్రశాంతం జీవన సౌందర్యానికి ప్రతీక

_ కొండపల్లి నీహారిణి

హలో ఫ్రెండ్స్

తరుణి సకల కళ స్వరూపంతో మీ ముందుకు వచ్చింది. ఏ విభాగానికి ఆ విభాగం విషయ సూచిక ఏర్పరచుకుని మిమ్మల్ని అలరించబోతున్నది. ఒక కవయిత్రి లేదా ఒక రచయిత్రి ఏమి ఆర్టికల్స్ పంపించినా ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా ఆ కవయిత్రి పేరుపైన టచ్ చేస్తే ఎప్పటికైనా కనిపిస్తాయి. ఒక్క ఆర్టికల్ గురించి సపరేట్గా లింక్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఆ లింకు అదే ఆర్టికల్ ను ఓపెన్ చేసే మార్గం ఏర్పరచుకున్నది ఇప్పుడు తరుణి. కొత్తగా కలాలను సంధించండి .సమాజానికి , ప్రత్యేకంగా స్త్రీ సమాజానికి ఉపయోగపడే మంచి మంచి ఆర్టికల్స్ రాయండి కథలు వ్యాసాలు కవితలు మీరు ఏవి రాసినా సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక ఆదర్శ భావజాలంతో అభ్యుదయ భావజాలంతో ముందడుగు వేసేలా ఉండాలి అని కోరుతున్నాను.

త్వరలో తరుణి పత్రిక కు ISSN number తెచ్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. కాబట్టి పరిశోధన చేస్తున్న విద్యార్థినులు కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఇంగ్లీషులో కూడా ఆర్టికల్స్ ఏమైనా పంపిస్తే ప్రచురిస్తాను. మీ అందరి సహాయ సహకారాలు రచనలో ఉండాలని మరోసారి కోరుతూ అందరికి శుభాకాంక్షలు తో

మీ కొండపల్లి నీహారిణి

This post was created with our nice and easy submission form. Create your post!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శ్రీ మతి ఉమారమణ గారు

ఆత్మీయత